వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) వార్షిక బడ్జెట్(Budget)ను కేంద్ర ఆర్థిక మంత్రి(Union Finance Minister) నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1న ఆమె పార్లమెంట్(Parliament )కు బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తారు. ఈ దఫా రెండు సెషన్లలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొదటి సెషన్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుండగా, రెండో సెషన్ మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. బడ్జెట్ సమావేశాలు(Budget session) ప్రారంభమయ్యే రోజు అనగా జనవరి 29వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్(Ram Nath Kovind) ప్రసంగించనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను అధిగమించి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని టీం అత్యంత సవాళ్లతో కూడిన బడ్జెట్ను సమర్పించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతుండటం విశేషం.
హల్వా కార్యక్రమం ఉంటుందా?
సాధారణంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ విధి విధానాలు ఖరారైన తర్వాత హల్వా కార్యక్రమం(Halwa Ceremony) నిర్వహిస్తారు. దీని తర్వాతే బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభం అవుతుంది. అయితే, ఈ దఫా పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో హల్వా తయారీ ముచ్చట ఉండకపోవచ్చుని తొలుత అందరూ భావించారు. కానీ, సంప్రదాయంగా కొనసాగుతున్న హల్వా తయారీ వేడుకను బడ్జెట్ సమర్పణకు10 రోజుల ముందు నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా, ఎంతోకాలం నుంచి కొనసాగుతోన్న పురాతన సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి పేపర్లెస్(Paperless) బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ సారి డిజిటల్ వేదికగానే బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు అందజేయనున్నారు.
బడ్జెట్–2021 అంచనాలు
కరోనా(corona) మహమ్మారి కారణంగా కుదేలైన భారత ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించేందుకు ఈ బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర బడ్జెట్–2021లో ఆర్థిక ఉద్దీపన చర్యలు ఉండాయని ఆర్థికవేత్తలు, నిపుణులు భావిస్తున్నారు. అంతేకాక, ఈ బడ్జెట్లో ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat)పై దృష్టి పెట్టడం, ఆర్థిక వ్యవస్థను గాఢిలో పెట్టడం, వ్యవసాయ రంగానికి తోడ్పాటు అందించడం వంటి చర్యలతో పాటు ఆరోగ్య సంరక్షణ వ్యయానికి ప్రోత్సాహకం ఉండవచ్చని వారు భావిస్తున్నారు. గతంలో భారత రక్షణ మంత్రి(Defence Minister )గా పనిచేనిన నిర్మలా సీతారామన్, ప్రస్తుతం, ఆర్థిక మంత్రి హోదాలో పూర్తికాల బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది మూడోసారి.
Published by:Hasaan Kandula
First published:January 15, 2021, 17:22 IST