బడ్జెట్ 2019 : పెరిగినవి ఏవి..? తగ్గనినవి ఏవి..?

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగనున్నాయి. పెట్రోల్ ధర రూ.2.50 మేర, డీజిల్ ధర రూ.2.30 మేర పెరగనుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతులపై కూడా కస్టమ్స్ డ్యూటీ విధించనున్నారు.

news18-telugu
Updated: July 5, 2019, 7:10 PM IST
బడ్జెట్ 2019 : పెరిగినవి ఏవి..? తగ్గనినవి ఏవి..?
నిర్మలా సీతారామన్ (File)
  • Share this:
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనగానే దేనిపై పన్నులు బాదారు..? ఏయే వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి.. పెరగబోతున్నాయి..? అన్న చర్చ కామన్.తాజా బడ్జెట్ ఎఫెక్ట్‌తో వివిధ వస్తువుల ధరలు పెరగనుండగా.. కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి.పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగనున్నాయి. పెట్రోల్ ధర రూ.2.50 మేర, డీజిల్ ధర రూ.2.30 మేర పెరగనుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతులపై కూడా కస్టమ్స్ డ్యూటీ విధించనున్నారు.

ధరలు పెరిగేవి :

పెట్రోల్, డీజిల్,బంగారం,దిగుమతి చేసుకునే పుస్తకాలు,పీవీసీ పైపులు,సబ్బులు,పొగాకు ఉత్పత్తులు,సీసీ కెమెరాలు,స్పీకర్లు,ఏసీలు,స్టెయిన్‌లెస్ స్టీల్,కార్ల అద్దాలు,ఆటో మొబైల్ వస్తువులు,మెటల్,ఫర్నీచర్,మేగజైన్స్, రబ్బరు,ఐపీ కెమెరా,సాకెట్స్,స్విచ్‌లు,గుట్కాలు,డిజిటల్ వీడియో రికార్డర్స్.

ధరలు తగ్గేవి :ఎలక్ట్రానిక్ వస్తువులు,ఎలక్ట్రిక్ వాహనాలు,సెట్‌టాప్ బాక్సులు,సెల్‌ఫోన్ చార్జర్స్,లిథియం బ్యాటరీ
First published: July 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు