Budget 2019: రూ.17 ప్రకటించి రైతులను అవమానిస్తారా? రైతుబంధుపై రాహుల్ కామెంట్

Budget 2019 : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రకారం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేల సాయం అందుతుంది. ఈ లెక్కన నెలకు రూ.500. అంటే రోజుకు 17 రూపాయలు మాత్రమే..! ఈ 17 నెంబర్‌నే ప్రధానంగా హైలైట్ చేస్తున్నాయి విపక్షాలు. రాహుల్‌తో పాటు చిదంబరం సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

news18-telugu
Updated: February 1, 2019, 5:00 PM IST
Budget 2019: రూ.17 ప్రకటించి రైతులను అవమానిస్తారా? రైతుబంధుపై రాహుల్ కామెంట్
న్యూస్ 18 క్రియేటివ్
  • Share this:
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'రైతుబంధు' పథకం తరహాలోనే 'పీఎం కిసాన్ యోజన' ప్రకటించింది కేంద్రం. ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏటా రూ.6వేలు అందజేస్తారు. ఇప్పుడు ఈ పథకంపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది చారిత్రక నిర్ణయమని బీజేపీ నేతలు చెబుతోంటే... ఎందుకూ పనికి రాదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ పథకం వల్ల రైతులకు ఒరిగేదేం లేదని మండిపడుతున్నాయి. రైతులకు రూ.17 ప్రకటించి..తీవ్రంగా అవమానించారని రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. బడ్జెట్‌లో ప్రకటించిన పీఎం కిసాన్ యోజనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మోదీ గారు, ఐదేళ్ల అహంకార, అసమర్థ పాలనలో రైతులను సర్వ నాశనం చేశారు. ఇప్పుడు రోజుకు రూ.17 రూపాయలు ప్రకటించి అవమానించారు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రకారం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేల సాయం అందుతుంది. ఈ లెక్కన నెలకు రూ.500. అంటే రోజుకు 17 రూపాయలు మాత్రమే..! ఈ 17 నెంబర్‌నే ప్రధానంగా హైలైట్ చేస్తున్నాయి విపక్షాలు. రాహుల్‌తో పాటు చిదంబరం సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు.రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే పీఎం కిసాన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంతో దేశంలోని 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. విడతకు రూ.2వేలు చొప్పున మూడు విడతలల్లో మొత్తం రూ.6వేలు చెల్లించనున్నారు. నేరుగా రైతుల అకౌంట్లలోకే డబ్బును జమచేస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఏటా రూ.75వేల కోట్లు కేటాయించనుంది కేంద్రం.

First published: February 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు