హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంగ్రెస్‌ ఆశలపై నీళ్లు....మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ ఒంటరి పోరు?

కాంగ్రెస్‌ ఆశలపై నీళ్లు....మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ ఒంటరి పోరు?

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ చేతులు కలిపితే అధికారం తమదేనని ధీమా వ్యక్తంచేస్తున్న కాంగ్రెస్ నేతలు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ చేతులు కలిపితే అధికారం తమదేనని ధీమా వ్యక్తంచేస్తున్న కాంగ్రెస్ నేతలు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ చేతులు కలిపితే అధికారం తమదేనని ధీమా వ్యక్తంచేస్తున్న కాంగ్రెస్ నేతలు.

  జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగనున్నట్లు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ సంకేతాలిచ్చింది. పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీతో తాము చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో వెలువడుతున్న కథనాలను తోసిపుచ్చింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండబోదని ఆ పార్టీ సంకేతాలిచ్చింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు బీఎస్పీ మధ్యప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడు నర్మదా ప్రసాద్ ప్రకటించారు. పొత్తులకు సంబంధించి తమ పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి తమకు ఎలాంటి సందేశం అందలేదని చెప్పారు.

  అటు నర్మదా ప్రసాద్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. పొత్తులకు సంబంధించి బీఎస్పీతో చర్చలు జరుపుతున్నట్లు తాము చెప్పలేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ మనక్ అగర్వాల్ తెలిపారు. సైద్ధాంతిక సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తామని మాత్రమే తాము చెప్పినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇందులో బీఎస్పీ ఉన్నట్లు తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎన్నికల సమయంలో సందర్భానుసారం పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

  ఈ ఏడాది చివర్లో నవంబరు-డిసెంబరులో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 2013లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 44.88 శాతం ఓట్లతో బీజేపీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టగా...కాంగ్రెస్‌కు 36.38 శాతం, బీఎస్పీకి 6.29 శాతం ఓట్లు దక్కాయి. 230 మంది సభ్యులతో కూడిన మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 165 స్థానాల్లో విజయం సాధించగా...కాంగ్రెస్ 58 స్థానాలు, బీఎస్పీ 4 స్థానాలు, 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అంతకు ముందు 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 37.64 శాతం ఓట్లతో అధికారంలోకి రాగా...కాంగ్రెస్ పార్టీకి 32.85 శాతం, బీఎస్పీకి 8.97 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్- బీఎస్పీలకు దక్కిన మొత్తం ఓట్ల శాతం, బీజేపీకి పోల్ అయిన ఓట్ల శాతం కంటే నాలుగు శాతం ఎక్కువగా ఉండడం విశేషం.

  ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్-బీఎస్పీలు చేతులు కలిపితే అధికారం తమదేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీ కేంద్ర నాయకత్వాల మధ్య చర్చలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.

  First published:

  Tags: Bsp, Congress, Madhya pradesh, Mayawati

  ఉత్తమ కథలు