హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కోర్టులో లొంగిపోయిన బీఎస్పీ మాజీ ఎంపీ కుమారుడు

కోర్టులో లొంగిపోయిన బీఎస్పీ మాజీ ఎంపీ కుమారుడు

చేతిలో గన్‌తో ఆశిష్‌పాండే (File)

చేతిలో గన్‌తో ఆశిష్‌పాండే (File)

బీఎస్పీ మాజీ ఎంపీ ఆశిష్ పాండే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గౌరవ్ కన్వర్ మధ్య గొడవ లేడీస్ టాయిలెట్ దగ్గర మొదలైందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

  ఢిల్లీలోని హయత్ హోటల్లో గన్‌తో హల్‌చల్ చేసిన బీఎస్పీ మాజీ ఎంపీ కుమారుడు ఆశిష్ పాండే కోర్టులో లొంగిపోయారు. అతడిని కోర్టు ఒకరోజు పోలీసు కస్టడీకి ఇచ్చింది. న్యాయం కోసం తాను లొంగిపోతున్నానని, తనను పోలీసు కస్టడీకి పంపాల్సిందిగా ఆశిష్ పాండే ఢిల్లీలోని పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. లొంగిపోవడానికి ముందు ఆశిష్ పాండే ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశాడు. జరిగిన ఘటనలో తన తప్పేం లేదని చెప్పాడు. కావాలనే తనను టార్గెట్ చేశారని.. ఇరికించారని ఆరోపించాడు. హయత్ రెసిడెన్సీ హోటల్ లాబీల్లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గౌరవ్ కన్వర్, అతనితోపాటు ఉన్న యువతిని ఆశిష్ పాండే పిస్టల్‌తో బెదిరిస్తున్నట్టు వీడియోలో కనిపించగా... ఆ గన్‌ తన వెనుక వేలాడుతోందని.. తాను ఎవరినీ బెదిరించలేదని.. ఆ ఘటనలో అసలు తానే బాధితుడినని చెప్పాడు.

  నేను రాజకీయ నాయకుడి కుమారుడిని. అదేం నేరం కాదే. నా మీద ఒక్క కేసు కూడా లేదు. నాకు గన్ 20 ఏళ్లుగా ఉంది. నేను లొంగిపోతా. అలాగే, ఆ రోజు ఏం జరిగిందో మొత్తం సీసీటీవీ కెమెరాల వీడియోను మీడియా చూడాలి. అలాచేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. కన్వర్.. నన్ను చంపుతానని బెదిరించిన విషయం వెలుగుచూస్తుంది. అయినా నేను గన్‌తో బెదిరించలేదు. అది నా వెనుక వేలాడుతోందంతే. కన్వర్‌తో ఉన్న మహిళను కూడా నేనేం అనలేదు.

  ఆశిష్ పాండే, బీఎస్పీ మాజీ ఎంపీ రాకేష్ పాండే కుమారుడు

  ఈనెల 14వ తేదీ ఆదివారం రాత్రి ఘటన జరిగింది. ఆశిష్ పాండే గన్‌తో ఓ జంటను బెదిరిస్తున్న వీడియో సోమవారం బయటకు వచ్చింది. అది వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఢిల్లీ, యూపీ పోలీసులు సుమారు 50 ప్రాంతాల్లో సోదాలు చేశారు. తండ్రి రాకేష్ పాండే, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశారు. వారిని, హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ క్రమంలో కోర్టు బుధవారం అతడి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో గురువారం కోర్టు ఎదుట లొంగిపోయాడు.

  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆశిష్ పాండే‌కు మూడు లైసెన్స్‌డ్‌ గన్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారు. మరోవైపు ఆ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు కన్వర్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చాడు. ‘గన్ తీసి మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు. అందుకే భయపడి ఫిర్యాదు చేయలేదు.’ అని తన స్టేట్‌మెంట్‌లో తెలిపాడు.

  ఇవి కూడా చదవండి

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bsp

  ఉత్తమ కథలు