Home /News /national /

BSP CHIEF MAYAWATI MOTHER RAMRATI DIES AT 92 DUE TO HEART FAILURE LAST RITES AT DELHI ON SUNDAY MKS

Mayawati : బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇంట్లో విషాదం -ఏడాది వ్యవధిలో ఇద్దరు..

మాయవతి

మాయవతి

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఇంట్లో విషాదం నెలకొంది. మాయావతి తల్లి రామ్‌రతి కన్నుమూశారు. మాయావతి తండ్రి ప్రభుదయాళ్ గతేడాది నవంబర్ 19న చనిపోగా, ఏడాది తిరిగిలోపే తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఢిల్లీలో ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని బీఎస్పీ ప్రకటన చేసింది.

ఇంకా చదవండి ...
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఇంట్లో విషాదం నెలకొంది. మాయావతి తల్లి రామ్‌రతి కన్నుమూశారు. 92 ఏళ్ల రామ్‌రతి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను ఢిల్లీలోనే ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. శనివారం నాడు గుండె పనిచేయడం పూర్తిగా ఆగిపోవడంతో రామ్‌రతి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతోన్న మాయావతి.. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ఢిల్లీకి పయనమయ్యారు.

అధినేత్రి మాయావతి మాతృమూర్తి రామ్‌రతి మరణంతో దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్పీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. రామ్‌రతి ఆత్మకు శాంతి చేకూరాలని, కష్ట సమయంలో మాయావతి ధైర్యంగా ఉండాలంటూ నేతలు ప్రకటనలు చేశారు. కాగా, మాయావతి తండ్రి ప్రభుదయాళ్ గతేడాది నవంబర్ 19న కన్నుమూశారు. ఆయన మరణించి ఏడాది కూడా గడవకముందే ఇప్పుడు తల్లి రామ్‌రతి కూడా ప్రాణాలు కోల్పోవడంతో మాయావతి విషాదంలో మునిగారు.

తల్లిదండ్రులతో మాయావతి (పాత ఫొటో)


మాయావతి తల్లి రామ్‌రతికు ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహిస్తారని, ఆదివారం నాడు ఈ కార్యక్రమం ఉంటుందని బీఎస్పీ పార్టీ అధికారిక ఖాతాల్లో వెల్లడించింది. మాయవతి కుటుంబంలో విషాదంపై పలు పార్టీల నేతలు సంతాపాలు తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bsp, Delhi, Mayawati, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు