సంక్షోభంలో బీఎస్ఎన్ఎల్ : మూసివేయక తప్పదా..? అసలేం జరుగుతోంది..

ఉద్యోగులకు జూన్ నెల వేతనాలు ఇచ్చేందుకు కేంద్రాన్ని బీఎస్ఎన్ఎల్ రూ.850కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకుంది. సంస్థను కొన్ని నెలల పాటు నిలకడగా నడపాలంటే మొత్తం రూ.2500కోట్ల రుణం అవసరమవుతుందని కేంద్రానికి తెలిపింది.

news18-telugu
Updated: June 26, 2019, 9:29 AM IST
సంక్షోభంలో బీఎస్ఎన్ఎల్ : మూసివేయక తప్పదా..? అసలేం జరుగుతోంది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.ఒకప్పుడు ఏడాదికి రూ.10వేల కోట్ల పైచిలుకు లాభాలు ఆర్జించిన సంస్థ..నేడు దాదాపు రూ.13వేల కోట్ల పైచిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో త్వరలోనే కార్యకలాపాలను ఆపివేయాలనే ఆలోచనలో ఉంది. టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో బీఎస్ఎన్ఎల్ పరిస్థితి ఇంతలా దిగజారింది.సర్వీస్ విషయంలోనూ,టెక్నాలజీ విషయంలోనూ మిగతా టెలికాం సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడలేకపోతోంది. మిగతా సంస్థలన్నీ 5G టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంటే.. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ ఇంకా 4G టెస్టింగ్ దగ్గరే ఉంది.

ఉద్యోగులకు జూన్ నెల వేతనాలు ఇచ్చేందుకు కేంద్రాన్ని బీఎస్ఎన్ఎల్ రూ.850కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకుంది. సంస్థను కొన్ని నెలల పాటు నిలకడగా నడపాలంటే మొత్తం రూ.2500కోట్ల రుణం అవసరమవుతుందని కేంద్రానికి తెలిపింది.అయితే కేంద్రం నుంచి మాత్రం నిధులకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి హామీ లభించలేదు.

మీడియా కథనాల ప్రకారం.. గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సరైన పాలసీలు తీసుకురాకపోవడం.. కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో జాప్యం.. బీఎస్ఎన్ఎల్‌ను ఈ పరిస్థితిలోకి నెట్టాయని అంటున్నారు. ఒకవేళ బీఎస్ఎన్ఎల్ అడిగిన రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పించేందుకు సిద్దమైనా.. తిరిగి ఆ మొత్తాన్ని ఎలా చెల్లించగలదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్రం ఇచ్చే నిధులు తాత్కాలిక ఉపశమనమే తప్పితే.. సంక్షోభానికి తెరదించలేవని అంటున్నారు. అసలు బీఎస్ఎన్ఎల్‌ను మరేదైనా ప్రైవేట్ టెలికాం సంస్థలో విలీనం చేస్తే మేలు అని.. అలా అయితేనే భవిష్యత్తులో దాని సర్వీసులు కొనసాగుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: June 26, 2019, 9:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading