Home /News /national /

BSF SEIZES PAKISTANI BOAT NEAR FEROZEPUR IN PUNJAB DAYS AFTER PM MODI SECURITY BREACH MKS

PM Modi కాన్వాయ్ ఆగిన చోటే Pakistan పడవ.. ఫిరోజ్‌పూర్‌లో సీజ్ చేసిన BSF

ఫిరోజ్‌పూర్‌లో పాక్ బోటు సీజ్

ఫిరోజ్‌పూర్‌లో పాక్ బోటు సీజ్

ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విఫలమైన ఘటనపై రాజకీయ రచ్చ కొనసాగుతుండగా, మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. మోదీ సభ జరగాల్సిన ఫిరోజ్‌పూర్‌ సమీపంలో అనుమానాస్పద పాకిస్తాన్ బోటును భద్రతా బలగాలు సీజ్ చేశాయి. వివరాలివి..

అత్యంత అరుదైన సంఘటనగా పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విఫలమైన ఘటనపై రాజకీయ రచ్చ కొనసాగుతుండగా, మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. మోదీ సభ జరగాల్సిన ఫిరోజ్‌పూర్‌ సమీపంలో అనుమానాస్పద పాకిస్తాన్ బోటును భద్రతా బలగాలు సీజ్ చేశాయి. ఫిరోజ్‌పూర్‌ లోని సట్లైజ్ నది రెండు దేశాలకు సరిహద్దుగా ఉండగా, పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ప్రధాని కాన్వాయ్ ఆగిపోవడం తెలిసిందే. బుధవారం నాడు ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం చోటుచేసుకోగా, శుక్రవారం నాడు ఫిరోజ్‌పూర్‌ సమీపంలో పాకిస్తాన్ కు చెందిన అనుమానాస్పద బోటు ఒకటి పట్టుపడింది. దీనిపై బీఎస్ఎఫ్ అధికారులు చెప్పిన వివరాలివి..

పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్​పుర్​ జిల్లాలోని ఔట్​పోస్ట్​కు సమీపంలో వదిలివేసిన ఓ అనుమానాస్పద బోటును బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో, సట్లైజ్ నదిలో ఫిరోజ్ పూర్ వద్ద బోటును స్వాధీనం చేసుకున్నారు. 136వ బెటాలియన్​కు చెందిన సిబ్బంది డీటీ మాల్​ బార్డర్​ ఔట్​పోస్ట్​ సమీపంలో పెట్రోలింగ్​ నిర్వహిస్తుండగా.. చెక్క బోటును గుర్తించినట్లు బీఎస్​ఎఫ్​ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

ప్రాణాలతో తిరిగొచ్చా.. సీఎంకు థ్యాంక్స్ : PM Modi‌కి షాకింగ్ అనుభవం.. ఏడేళ్లలో తొలిసారి..



అంతర్జాతీయ సరిహద్దు కావడంతో ఫిరోజ్​పుర్​ అత్యంత సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతంగా ఉంటూ వస్తోందని, తరచూ పాకిస్తాన్ అనుమానాస్పద బోట్లు, ఇటీవల కాలంలో పాకిస్తాన్ డ్రోన్లు మన భూభాగంలోకి వచ్చిన ఘటనలు ఉన్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. శీతాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా పొగమంచుతో కప్పి ఉంటుందని, చెక్క పడవను గుర్తించిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేశామని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్థులను అప్రమత్తం చేశామని అధికారులు పేర్కొన్నారు.

lockdown: ఇక ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్.. నైట్ కర్ఫ్యూ షురూ : సీఎం సంచలన ఆదేశాలు



సాధారణంగా ఇలాంటి బోట్లను అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వాడుతుంటారని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. మూడు రోజుల కిందట ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం జరిగిన చోటుకు సమీపంలోనే పాక్ అనుమానాస్పద బోటు పట్టుపడటం సంచలనం రేపింది. పంజాబ్​ పర్యటనలో భాగంగా భద్రతా లోపంతో ఫిరోజ్​పుర్​లోని ఓ వంతెనపై 15-20 నిమిషాలపాటు ప్రధానమంత్రి కాన్వాయ్​ నిలిచిపోయింది. అయితే ఇది పొలిటికల్ డ్రామా అని పంజాబ్ పాలిత కాంగ్రెస్ విమర్శిస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Boat, BSF, Pakistan, Pm modi, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు