Home /News /national /

BSF ORDERS AIRLIFT FOR JAWAN IN JAMMU AND KASHMIR TO GET HIM HOME IN TIME FOR HIS WEDDING PVN

BSF: దటీజ్ ఇండియన్ ఆర్మీ..సరిహద్దుల్లో జవాన్ డ్యూటీ..సమయానికి పెళ్లిమండపంలో ఉండాలని స్పెషల్ హెలికాఫ్టర్ పంపిన ఆర్మీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Helicopter For Jawan Wedding :ఈ రోజు మనం ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం భారత సైనికులు. 24 గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని, కాశ్మీర్ మంచును, మేఘాలయా వర్షాలను లెక్కచేయకుండా దేశరక్షణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతారు.

ఇంకా చదవండి ...
Helicopter For Jawan Wedding :ఈ రోజు మనం ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం భారత సైనికులు. 24 గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని, కాశ్మీర్ మంచును, మేఘాలయా వర్షాలను లెక్కచేయకుండా దేశరక్షణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతారు. కోట్లాది భారతీయుల కోసం తమ కుటుంబాలకు దూరంగా మంచుగడ్డల్లో, ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. కేవలం దేశరక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలోనూ ముందుంటున్నారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్నే అయినా.. దేశాన్ని కాపాడేది సైనికుడు. అందుకే ముందుగా జై జవాన్, ఆ తరువాతే జై కిసాన్‌ అన్నారు. అయితే తాజాగా కశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఓ సైనికుడి కోసం ఆర్మీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్తువెత్తుతున్నాయి. దటీజ్ ఇండియన్ ఆర్మీ(Indian Army) అంటూ నెటిజన్లు మన ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది?ఆర్మీ అధికారులు ఆా జవాన్ కోసం ఏం చేశారో ఇప్పుడు చూద్దాం.

ఒడిషా రాష్ట్రానికి చెందిన నారాయణ బెహెరా అనే వ్యక్తి బీఎస్​ఎఫ్​ సైనికుడిగా(BSF Jawan)జమ్ముకశ్మీర్​(Jammu Kashmir)లోని మచిల్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ(LOC)దగ్గర విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే మే 2న ఒడిశాలోని తన గ్రామంలో నారాయణ బెహెరా వివాహం జరగనుంది. అయితే ప్రస్తుతం అతడు విధులు నిర్వహిస్తున్న ప్రదేశం కశ్మీర్​ లోయలో ఉన్నందున ఆ ప్రాంతమంతా మంచుతో నిండిపోయింది. రహదారి సంబంధం పూర్తిగా తెగిపోయింది. మచిల్​ సెక్టార్​ మంచుతో కూరుకుపోయి రహదారి సంబంధాన్ని కోల్పోయింది. నారాయణ డ్యూటీలో ఉన్న ప్రదేశం ఎత్తైనది కావడం వల్ల వేల కిలోమీటర్ల దూరంలో జరిగే వివాహానికి హజరయ్యేది అనుమానంగా ఉందని కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు. పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని,కుమారుడు వచ్చేలా ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు.

ALSO READ Rahul Gandhi| Prashant Kishore: పీకే కాంగ్రెస్‌లో చేరబోదని రాహుల్ గాంధీకి ముందే తెలుసా.. అందుకే అలా వెళ్లిపోయారా ?

నారాయణ బెహెరా విషయం తెలుసుకున్న బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్‌.. నారాయణ బెహెరా కోసం ప్రత్యేక హెలికాప్టర్​ ను ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌ లో ఉన్న చిరుత హెలికాప్టర్‌(Chiruta Helicopter)లో బెహెరాను తరలించాలని ఆదేశాలు అందడంతో...గురువారం తెల్లవారుజామున బెహరాను హెలికాప్టర్‌ లో ఎక్కించుకునHELICOP శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అతడు ఒడిశా దెంకనల్ జిల్లాలోని ఆదిపూర్ గ్రామంలోని తన ఇంటికి బయలుదేరాడు. సైనికుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని, అందుకే ప్రత్యేక హెలికాప్టర్​ ను నడిపినట్లు ఐజీ సింగ్ తెలిపారు. నారాయణ బెహెరా విధులు నిర్వహించే ప్రదేశాలలో మోహరించిన సైనికులకు వైమానిక దళంతో మాత్రమే రవాణా మార్గం సాధ్యమవుతుందని సరిహద్దు భద్రతా దళానికి చెందిన సీనియర్​ అధికారి తెలిపారు. దీంతో అతడిని తరలించడానికి ప్రత్యేక హెలికాప్టర్​ను వినియోగించినట్లు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: BSF, Helicopter, Indian Army, Jammu and Kashmir, Wedding

తదుపరి వార్తలు