భారత సరిహద్దుల్లోకి పాకిస్థాన్ డ్రోన్

పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద రాత్రి 10 గంటల నుంచి 10:40 మధ్య పాకిస్థాన్‌కు సంబంధించిన డ్రోన్ రౌండ్లు కొట్టింది. తిరిగి అర్ధరాత్రి 12:25 గంటల సమయంలో భారత సరిహద్దును దాటింది.

news18-telugu
Updated: October 8, 2019, 2:31 PM IST
భారత సరిహద్దుల్లోకి పాకిస్థాన్ డ్రోన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్థాన్‌ మరోసారి భారత్‌ను కవ్వించే పనిలో పడింది. భారత సరిహద్దుల్లోకి డ్రోన్ కెమెరాల్ని పంపింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ వద్ద ఉన్న హుస్సేనివాలా సరిహద్దు సమీపంలో పాక్‌కు చెందిన డ్రోన్‌ను భారత సరిహద్దు భద్రతా దళాలు గుర్తించాయి. పాక్‌కు చెందిన డ్రోన్‌ ఐదు సార్లు అక్కడే చక్కర్లు కొట్టి ఓసారి భారత సరిహద్దును కూడా దాటింది. పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద రాత్రి 10 గంటల నుంచి 10:40 మధ్య పాకిస్థాన్‌కు సంబంధించిన డ్రోన్ రౌండ్లు కొట్టింది. తిరిగి అర్ధరాత్రి 12:25 గంటల సమయంలో భారత సరిహద్దును దాటింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తం అయ్యారు.సరిహద్దు రక్షక దళాలు, పంజాబ్‌ పోలీసులు, ఇతర ఇంటెలిజెన్స్ వర్గాలు మంగళవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్స్ ద్వారా పాకిస్థానీ ఉగ్రమూకలు డ్రగ్స్‌, మందుగుండు సామగ్రి సరఫరా చేస్తున్నారేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల క్రితం ఇలాగే అనుమానాస్పదంగా తిరుగుతున్న రెండు పాకిస్తాన్ డ్రోన్లను పంజాబ్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు.

First published: October 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు