Home /News /national /

BSF JAWAN OPENS FIRE AT AMRITSAR KHASA CAMP JAWAN SHOT DEAD FIVE COLLEAGUES AND KILLS SELF MKS

BSF Jawan ఘాతుకం: సహచరులపై కాల్పులు, ఆపై ఆత్మహత్య.. మొత్తం 6గురు మృతి: Amritsar

బీఎస్ఎఫ్ క్యాంపులో కాల్పులు

బీఎస్ఎఫ్ క్యాంపులో కాల్పులు

అమృత్‌సర్‌ సమీపంలోని ఖాసా బెటాలియన్‌ బీఎస్‌ఎఫ్‌ శిబిరంలో ఓ జవాన్ తుపాకితో సహచరులపై కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తానూ కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు..

అది దేశ రక్షణలో ఫ్రంల్ లైన్‌లో నిలబడే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) విభాగం.. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంగా పంజాబ్ లోని అమృత్‌సర్‍ జిల్లా ఖాసాలోని కీలక స్థావరం.. ఆ క్యాంపులో ఇవాళ నెత్తుటిపాతం చోటుచేసుకుంది. పట్టరాని ఆవేశానికి లోనైన ఓ బీఎస్ఎఫ్ జవాన్ ఘాతుకానికి ఒడిగట్టాడు.. తన సర్వీస్ తుపాకితో సహచరులను కాల్చిపారేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలివి..

సహచర జవాన్లపై బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. అమృత్‌సర్‌ సమీపంలోని ఖాసా బెటాలియన్‌ బీఎస్‌ఎఫ్‌ శిబిరంలో ఓ జవాన్ తుపాకితో సహచరులపై కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తానూ కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

PM Modi | Pune Metro : పుణె మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ.. టికెట్ కొని తొలి ప్రయాణం.. సీఎం ఠాక్రే డుమ్మా


ఖాసా బెటాలియన్ క్యాంపులో ఆదివారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. జవాన్ కాల్పుల్లో నలుగురు సహచరులు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడైంది. కాల్పుల ఘటనతో బీఎస్ఎఫ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

RS Praveen kumar: ముందస్తుకు BSP వ్యూహం.. బహుజన రాజ్యాధికార యాత్ర షురూ.. 300రోజులపాటు


జవాన్ కాల్పుల్లో గాయపడ్డ మరికొందరికి స్థానిక గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణ జరుగుతోందని, కాల్పులకు దారితీసిన కారణాలు, ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. కాల్పులు జరిపిన జవాన్ పేరు సట్టెప్పాగా తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: BSF, Punjab, Shooting

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు