పంజాబ్‌లో ఇద్దరు పాక్ పౌరుల అరెస్ట్...ప్రశ్నిస్తున్న బీఎస్ఎఫ్

పంజాబ్‌లో ఇద్దరు పాక్ జాతీయులను అరెస్టు చేసిన బీఎస్ఎఫ్...వారిని తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

news18-telugu
Updated: October 22, 2019, 12:08 PM IST
పంజాబ్‌లో ఇద్దరు పాక్ పౌరుల అరెస్ట్...ప్రశ్నిస్తున్న బీఎస్ఎఫ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పంజాబ్‌లో పాకిస్థాన్ జాతీయులు ఇద్దరిని భారత సరిహద్దు దళాలు(బీఎస్ఎఫ్) మంగళవారం ఉదయం అరెస్ట్ చేశాయి. వీరిని పాకిస్థాన్‌కు చెందిన మొహమ్మద్ లతీఫ్, మొహమ్మద్ సైఫ్‌గా గుర్తించారు. బీఎస్ఎఫ్ అబోహర్ సెక్టార్‌లోని సమస్కే బీఓపీ ఔట్‌పోస్ట్ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వీరిద్దరిని బీఎస్ఎఫ్ కస్టీడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరు భారత్‌లోకి చొరబడటానికి కారణాలపై ప్రశ్నిస్తున్నారు. తీవ్రవాద చర్యల కోసం దేశంలోకి చొరబడ్డారా? గూఢచర్యం చేస్తున్నారా? అనే కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేయడం తెలిసిందే. దీంతో జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు పాక్ కుయుక్తులకు పాల్పడుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉండడంతో జమ్ముకశ్మీర్‌తో పాు పంజాబ్‌లో దేశ సరిహద్దుల వెంబడి భారత సరిహద్దు బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>