హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Brutal Murder:ఏందీ భయ్యా ఈ దారుణం.. మటన్ ముక్క కోసం ఇంత బరి తెగించాలా.. కట్టుకున్న భార్యనే!

Brutal Murder:ఏందీ భయ్యా ఈ దారుణం.. మటన్ ముక్క కోసం ఇంత బరి తెగించాలా.. కట్టుకున్న భార్యనే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏదో కారణాలతో గొడవలు పడుతూ భాగస్వామి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు కొందరు. వంట వండడానికి మాంసం తీసుకరాలేదని..

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్య కాలంలో ప్రతీ చిన్న విషయానికి చంపడం అలవాటుగా మారిపోయింది.. అసలు కారణం లేకుండా క్షణికావేశంలో హత్యలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఏ విషయంలోనైనా అర్థం చేసుకోని జీవించాల్సిన భార్య, భర్తలు.. సహనం కోల్పోతున్నారు.. భర్తను చంపిన భార్య, భార్యను చంపిన ఘటనలు రోజూ ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటున్నాయి.. ఏదో కారణాలతో గొడవలు పడుతూ భాగస్వామి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు కొందరు. వంట వండడానికి మాంసం తీసుకరాలేదని భర్త భార్య గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో రోరావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మటన్‌ కోసం మర్డర్‌:

అలీగఢ్‌లోని మబుద్ నగర్ ప్రాంతంలో సాగిర్(35), గుడ్డో(30) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంట్లో వంట వండడానికి మాంసం తీసుకరాలేదని భార్యతో భర్త గొడవ పడ్డాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పిల్లలు చూస్తుండగానే కత్తి తీసుకొని భార్య గొంతు కోశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు భర్తను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అలీగఢ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడి అరెస్టు చేయడంతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి కుల్దీప్ గునావత్ తెలిపారు.

పోలీసులకు జరిగింది చెప్పిన కూతురు:

మృతురాలి కుమార్తె సంఘటన మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసింది. మాంసం విషయంలో తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత ఆమె తండ్రి తన తల్లి గొంతు కోశాడని చుట్టుపక్కలవారికి చెప్పింది. దీంతో వారు సగీర్‌ను పారిపోకుండా.. పట్టుకున్నారు. అటు పోలీసులకు కూడా జరిగిన విషయాన్ని జరిగినట్లు చెప్పినట్లు చెప్పింది. ఇక మటన్ ముక్క కోసం ఇంత బరి తెగించాలా అని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యూపీలో జరిగిన మరో పరువు హత్య సంచలనం రేపుతోంది. కూతురు మరో వ్యక్తిని ప్రేమిస్తుందని తెలుసుకున్న తండ్రి.. ఆమెను విచక్షణా రహితంగా కొట్టి హతమార్చాడు. ఈ విషయం బయటికి చెప్పొద్దని చిన్నకూతుర్ని బెదిరించాడు. కానీ అక్క మరణాన్ని తట్టుకోలేక ఆమె నోరు విప్పడంతో విషయం వెలుగుచూసింది. ఈ పరువుహత్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ జిల్లా కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక మూఢనమ్మకాల మోజులో పడి కొడుకు అరోగ్యం బాగవుతుందని నమ్మి బాలుడిని తండ్రి బలిచ్చిన ఘటన కూడా యూపీలోని బహ్రైచ్‌ జిల్లాలోనే చోటు చేసుకుంది.

First published:

Tags: Brutally murder, Uttar pradesh

ఉత్తమ కథలు