కొవిడ్ నియంత్రణలో యూపీ ప్రభుత్వ తీరుకు బ్రిటిష్ హై కమిషనర్ మెచ్చుకోలు

Covid

పాండమిక్ నియంత్రణలో భాగంగా తాము చేపట్టిన చర్యల గురించి సీఎం, ఆయనకు వివరంగా చెప్పారు. యూపీ ప్రభుత్వం ఇప్పటికే 7 కోట్ల వ్యాక్సిన్లు అందజేసిందని,

 • Share this:
  మహిళలు, బాలికల సాధికారత, స్థానిక కళాకారులకు ప్రోత్సాహం విషయంలు యోగి ప్రభుత్వం పనితీరును బ్రిటిష్ ఎన్వాయ్ మెచ్చుకున్నారు. అలాగే ఆరోగ్య, విద్య, రక్షణ, పర్యావరణ, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆసక్తిని ఆయన కొనియాడారు.

  కొవిడ్ రెండో వేవ్ ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేసినందుకు గాను శుక్రవారం రోజున ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని భారతదేశంలో యూకే హైకమిషనర్ అలెక్స్ ఎల్లీస్ పొగడ్తలతో ముంచేశారు. అలాగే మహిళల సాధికారత, బాలికల విద్య, ఇంకా మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, స్థానిక కళాకారులకు ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సహాకాల గురించి కూడా అలెక్స్ మెచ్చుకున్నారు.

  పాండమిక్ నియంత్రణలో భాగంగా తాము చేపట్టిన చర్యల గురించి సీఎం, ఆయనకు వివరంగా చెప్పారు. యూపీ ప్రభుత్వం ఇప్పటికే 7 కోట్ల వ్యాక్సిన్లు అందజేసిందని, అలాగే ఆరు కోట్ల కొవిడ్ టెస్టులు నిర్వహించి దేశంలోనే ముందంజలో ఉందన్న విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు.

  కొవిడ్ విషయంలో యూపీ ప్రభుత్వం పనితీరు గురించి ముఖ్యమంత్రి వివరణకు బ్రిటిష్ హైకమిషనర్ హర్షం వ్యక్తం చేశారు.”

  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఇంటికి విచ్చేసిన ఎల్లీస్, యోగి ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూనే, ఆరోగ్య, రక్షణ, పర్యావరణ, డిజైనింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో కలిసి పనిచేయాలని ఉందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP) గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆరోగ్యం, విద్య, MSME, రక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, జంతువుల రక్షణ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో అవకాశాలను గుర్తించి, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా కృషి చేయాలని బ్రిటిష్ హైకమిషనర్ అన్నారు.

  యునైటెడ్ కింగ్‌డమ్‌కు టెక్స్‌టైల్, లెదర్ సరుకులను ఎగుమతి చేసే విషయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చాలా వనరులు ఉన్నాయని ఆయన, సీఎం యోగితో అన్నారు. ఇదివరకే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని బ్రిటిష్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి, త్వరలో అవి మరింత విస్తరించనున్నాయని, అంతేకాకుండా కరోనా సమయంలో ఇరు దేశాలు మాస్కుల తయారీలో, మెడికల్ పరికరాల ఉత్పత్తిలో సహకరించుకున్నాయని ఆయన గుర్తుచేశారు.

  విద్యా రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ ఎన్వాయ్ అన్నారు. కరికులమ్, పెడగాగీ, ఇంకా ఇతర యునైటెడ్ కింగ్‌డమ్ యూనివర్సిటీల్లో అమలు చేసే అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పరచుకోవచ్చని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో విద్యా రంగంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిసి ఆయన సంతోషించారు.

  ఈ సందర్శనలో భాగంగా, గ్రీన్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనీ కూడా ఎల్లీస్ సందర్శించారు. పర్యావరణాన్ని రక్షిస్తూ ఖాదీ వస్త్రాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఖాదీ వస్త్రాన్ని నేయడానికి ఉపయోగించే సౌరశక్తితో నడిచే చరఖాలను చూసి బ్రిటిష్ హై కమిషనర్ అబ్బురపడ్డారు. పర్యావరణహిత వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో భాగంగా తమ దేశంలో కూడా సౌరశక్తితో నడిచే చరఖాలను ఉపయోగించగల అవకాశాల గురించి కూడా ఈ సందర్భంగా ఆయన చర్చించారు.

  అలాగే 25 ఏళ్ల క్రితం ఆయన వారణాసి పర్యటన గురించి కూడా అలెక్స్ ఎల్లీస్ గుర్తుచేసుకున్నారు. ఆ పురాతన నగరంలో తాను అనుభూతి చెందిన ఆధ్యాత్మిక భావనల గురించి ఆయన, సీఎంతో చెప్పారు. వారణాసి ప్రధానమంత్రి నియోజకవర్గం అని తెలిసి ఆయన సంతోషించారు. అందుకే అన్ని విషయాల్లోనూ ఆ నగరం అభివృద్ధి చెందిందని ఆయన కొనియాడారు.
  Published by:Rekulapally Saichand
  First published: