హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వరద నీటిలో కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వైరల్ వీడియో.. గతంలో 115 భక్తులు మృతిచెందింది ఇక్కడే..

వరద నీటిలో కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వైరల్ వీడియో.. గతంలో 115 భక్తులు మృతిచెందింది ఇక్కడే..

(Image-Twitter/Anurag Dwary)

(Image-Twitter/Anurag Dwary)

బ్రిడ్జి‌ పైనుంచి వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ కాసేపటికే బ్రిడ్జి మొత్తం.. వరద నీటిలో కొట్టుకుపోయింది.

భారీ వరదలకు ఒకే నదిపై ఉన్న రెండు బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో దాటియా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తిగా నిండిన డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇలా జరిగింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ బ్రిడ్జి‌ పైనుంచి వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ కాసేపటికే బ్రిడ్జి మొత్తం.. వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇక, గత 24 గంటల నుంచి మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పలు జలశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. మణిఖేదా డ్యామ్ 10 గేట్లు ఓపెన్ చేశామని.. ప్రభావిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

ఈ బ్రిడ్జి.. సింధు నదిపై మణిఖేదా డ్యామ్ దిగువ భాగంలో  ఉంది. దాటియా నుచి రతన్‌గఢ్‌ పట్టణానికి మధ్య రాకపోకలు సాగించేందుకు వీలు కల్పిస్తోంది. రతన్‌గఢ్‌లోని దుర్గా మాతా ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. ఇక, 2009లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. అయితే 2013 అక్టోబర్‌లో నవరాత్రి ఉత్సవాల జరుగుతున్న వేళ.. ఇదే బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 115 భక్తులు మరణించారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తొక్కిసలాట అనంతరం ఈ బ్రిడ్జి మొత్తం మృతదేహాలతో హృదయవిదారకంగా కనిపించింది.


మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శివపురి, షెయోపూర్, గుణతో పాటు మరో రెండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే తొమ్మిది జిల్లాలకు అరెంజ్ అలర్ట్, మరో ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది. ‘మధ్యప్రదేశ్‌లో వరదల గురించి, చేపట్టిన సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి తెలియజేయబడింది. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో.. వరద ప్రభావిత ప్రాంతంలో సైన్యం సేవల వినియోగానికి సంబంధించి ప్రధానితో చర్చించడం జరిగింది’ అని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.

First published:

Tags: Floods, Madhya pradesh, Rains, Viral Video

ఉత్తమ కథలు