Wedding: కరోనా తెచ్చిన మార్పు.. నాకు వరుడు కావాలంటూనే.. కొత్త కండీషన్ పెట్టిన యువతి

ప్రతీకాత్మక చిత్రం

భవిష్యత్తులో కరోనా తీవ్రత ఇదే రకంగా కొనసాగితే.. మనుషుల అలవాట్లు, వ్యవహారశైలిలో మరిన్ని మార్పులు ఖాయమనే చర్చ కూడా సాగుతోంది.

  • Share this:
    కరోనా మన జీవితాలను ఎంతగానో మార్చింది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కరోనా రాకముందు ఉన్న జీవన విధానాలు, అలవాట్లలో ఇప్పుడు మార్పు సుస్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇంట్లో నిద్రలేచిన తరువాత గంట కూడా ఉండేందుకు ఇష్టపడని వారంతా.. ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా రోజుల కొద్దీ ఇంట్లో ఉండేందుకు అలవాటుపడిపోతున్నారు. ఇది మాత్రమే కాదు.. కరోనా కారణంగా అప్పటివరకు ఒకలా నడిచిన అనేక రంగాలు కొద్ది రూపును సంతరించుకున్నాయి. భవిష్యత్తులో కరోనా తీవ్రత ఇదే రకంగా కొనసాగితే.. మనుషుల అలవాట్లు, వ్యవహారశైలిలో మరిన్ని మార్పులు ఖాయమనే చర్చ కూడా సాగుతోంది. ఇలాంటి చర్చ సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

    ఓ అమ్మాయి తనకు కావాల్సిన వరుడి కోసం ఇచ్చిన పత్రికా ప్రకటనను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. సాధారణంగా వధువు కోసం వరుడు, వరుడి కోసం వధువు ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం కొత్తేమీ కాదు. కానీ ఆయన ట్వీట్ చేసిన ప్రకటన మాత్రం చాలా భిన్నంగా.. కరోనా పరిస్థితులకు అద్ధం పట్టే విధంగా ఉంది. రోమన్ క్యాథలిక్ వర్గానికి చెందిన 24 ఏళ్ల ఓ యువతి తనకు కావాల్సిన వరుడి కోసం పత్రికలో ప్రకటన ఇచ్చింది.



    ఇందులో మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా.. తనకు కావాల్సిన వరుడు కరోనా వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని అందులో పేర్కొనడం విశేషం. అందులోనూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుని ఉండాలని ఆ ప్రకటనలో యువతి క్లారిటీగా చెప్పింది. వీటితో పాటు తాను వరుడి నుంచి కోరుకుంటున్న మిగతా అంశాలను కూడా ప్రస్తావించింది. అయితే కరోనా కాలంలో పెళ్లి చేసుకోవాలనుకునే యువతులు.. వ్యాక్సిన్ వేసుకున్న వారే తమకు లైఫ్ పార్టనర్‌గా రావాలని కోరుకోవడం ఈ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడైంది.
    Published by:Kishore Akkaladevi
    First published: