BRIDE GROOM FULLY DRUNKED AND BREAK THE MARRIAGE VRY
Marriage : మండపంలో వధువు... పీకలదాకా తాగిన వరుడు.. కట్ చేస్తే...
ప్రతీకాత్మక చిత్రం
Marriage : కోటి ఆశాలతో పెళ్లి పీటలదాక వచ్చిన ఓ పెళ్లి కూతురుకు పెద్ద షాక్ తగిలింది..అందంగా ముస్తాబై ఆమె పెళ్లిమండపానికి వస్తే... పెళ్లి కొడుకు మాత్రం పీకల దాకా తాగి ఇంట్లోనే పడుకున్నాడు.
పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ విలువైన సంధర్భం. అయితే ఆ పెళ్లిలు అనేవి ఆయా వ్యక్తులు, కుటుంబాల వ్యవహరశైలిపై ఆధారపడి ఉంటుంది. దీంతో పెళ్లి కావాలంటే జీవితంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ,దురలవాట్లకు లోనుకాకుండా ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు.. మొత్తం మీద ఈ అబ్బాయి చాలా మంచోడు అంటేనే ఆ పెళ్లికి ఓకే చెబుతారు. అందుకే చాలా పెళ్లిల్లు తెలిసిన బంధువులు లేదా ఇతర ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువగా కుదురుతాయి. ముఖ్యంగా పెళ్లికి ముందు అబ్బాయికి ఎలాంటి అలవాట్లు ఉన్నా పెళ్లి నుండి వాటిని మానుకునే విధంగా ప్రయత్నాలు కూడా జరగుతాయి. అయితే కొన్నిసార్లు మారేందుకు అవకాశాలు ఉన్నా మరికొంతమంది తమ జీవితాంతం ఆ అలవాటుకు బానిస అవుతారు.. ఇక్కడ ఇలాంటి మద్యం అలవాటు ఉన్న ఓ పెళ్లికొడుకు వ్యవహారశైలితో ఏకంగా ఆ పెళ్లి ఆగిపోయిన పరిస్థితి కనిపించింది.
వివరాల్లోకి వెళితే..తమిళనాడు కాగా పెళ్లి ధర్మపురి జిల్లాలోని శరవణన్‌కు తిరువణ్ణామలై అనే యువతికి శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేశారు. దీంతో ఆ సమయానికి పెళ్లి కూతురు ఇంటికి బంధువులు,స్నేహితులు అందరు వచ్చారు. దీంతో అందరు కలిసి పెళ్లి మండపానికి వెళ్లారు. పెళ్లి కూతురు తరఫున అందరు అక్కడికి చేరుకున్నారు. కాని అసలు పెళ్లి చేసుకోవాల్సిన వరుడు మాత్రం రాలేదు. ముహుర్త సమయం దగ్గరపడుతున్నా వారు మాత్రం చేరుకోలేదు.. తీరా చూస్తే.. పెళ్లి కూతురు బంధువులు టెన్షన్ గురయి పెళ్లికొడుకు ఇంటికి వెళ్లారు. దీంతో పెళ్లి కూతురుతో సహా అందరు షాక్‌కు గురయ్యారు. కనీసం పెళ్లి ఉందనే సోయి లేకుండా పీకలదాక తాగిన పెళ్లి కొడుకు ఇంట్లోనే బొక్కబోర్లా పడుకుని దర్శనమిచ్చాడు.
ఈ సంఘటనతో పెళ్లికి ముందే ఇలా ఉంటే .. పెళ్లి తర్వాత ఇంకా ఎలా ఉంటాడో అనే సందేహం పెళ్లికూతురులో మొదలైంది. ఆ పెళ్లి తనకు వద్దంటూ తేల్చి చెప్పింది. అయితే బంధువులతోపాటు కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా...తాను మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. తీరా ఇంత హాంగామా జరుగుతుంటే.. అప్పుడు తేరుకున్న పెళ్లి కొడుకు బుద్ది తెచ్చుకుని తాను ఇకముందు మద్యం సేవించనని చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవాలని బత్రిమాలాడాడు. కాని ఆ వధువు మాత్రం ససేమీరా అనడంతో పెళ్లిపీటల దాకా వచ్చి ఆ పెళ్లి ఆర్థాంతరంగా ఆగిపోయింది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.