Home /News /national /

BRIDE AND GROOM WHO DIED 30 YEARS AGO NOW MARRIED OFF IN TRADITIONAL CEREMONY VIDEOS GOES VIRAL SK

Pretha Kalyanam: వధువు, వరుడు 30 ఏళ్ల క్రితమే మృతి.. ఇప్పుడు ఘనంగా పెళ్లి.. మీరూ చూసేయండి

ప్రేత కల్యాణం

ప్రేత కల్యాణం

అతడు జులై 28న దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ పెళ్లికి వెళ్లాడు. చందప్ప, శోభల వివాహాహానికి హాజరై .. వధూవరులను  ఆయన ఆశీర్వదించాడు. నిజానికి అక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు లేరు. వారిద్దరు 30 ఏళ్ల క్రితమే చనిపోయారు.

    30 ఏళ్ల క్రితం  అమ్మాయి చనిపోయింది. అబ్బాయి కూడా ఇంచు మించు అప్పుడే మరణించాడు. కానీ వారిద్దరికి ఇప్పుడు పెళ్లి చేశారు. చాలా ఘనంగా.. సంప్రదాయబద్ధంగా వివాహ వేడుకను జరిపించారు. ఇదేం విచిత్రం..? ఇలా కూడా జరుగుతుందా? 30 ఏళ్ల క్రితం మరణించిన వారికి ఇప్పుడెలా పెళ్లి చేస్తారు? అని ఆశ్చర్యపోకండి.  ఇది జోక్ అని కొట్టి పారేయకండి. నిజంగానే  వివాహం చేశారు.  కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సహా చాలా ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఉంది. అక్కడి ప్రజలు దానిని ఇప్పటికీ పాటిస్తున్నారు.

    అది పాముల ప్రపంచం.. పక్షులను కూడా ఎగిరి కాటేస్తాయి.. పొరపాటున వెళ్లారో.. మళ్లీ రారు

    కర్నాటక (Karnataka)లో పాటించే ఈ వింత సంప్రదాయాన్ని  'ప్రేత కల్యాణం' (Pretha Kalyanam) అని పిలుస్తారు. 'ఆనీ అరుణ్' అనే ట్విటర్(Twitter) యూజర్ ప్రేత కల్యాణం గురించి ట్విటర్లో వివరించారు. అతడు జులై 28న దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ పెళ్లికి వెళ్లాడు. చందప్ప, శోభల వివాహాహానికి హాజరై .. వధూవరులను  ఆశీర్వదించాడు. నిజానికి అక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు లేరు. 30 ఏళ్ల క్రితమే చనిపోయారు. కానీ వారికి ఇప్పుడు ఘనంగా వివాహం జరిపారు. నిశ్చితార్థం నుంచి అప్పగింతల వరకు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వింత పెళ్లిని చూసి ఆనీ అరుణ్ ఆశ్చర్యపోయాడు. దాని గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పెళ్లి వీడియోలను ట్రిటర్ థ్రెడ్స్ రూపంలో పోస్ట్ చేశాడు 'ఆనీ అరుణ్'.



    కాన్పు సమయంలో మరణించే పిల్లలకు.. యుక్త వయసు వచ్చాక పెళ్లి చేయడం కర్నాటకతో పాటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తోంది. దీనిని 'ప్రేత కల్యాణం' అంటారు. 2002, అంతకంటే ముందు సమయంలో మరణిించిన అమ్మాయి, అబ్బాయిలకు.. ఇప్పుడు పెళ్లి చేస్తారు. అమ్మాయిల కంటే అబ్బాయిల వయసు తక్కువగా ఉండకూడదు. ఒకరి ఇంట్లో గతంలో ఎవరైనా అబ్బాయి మరణిస్తే.. వీరిలాగే ఎవరైనా ఇంట్లో అమ్మాయి మరణించి ఉంటే.. వారితో సంబంధం కలుపుకొని.. ఇద్దరికి పెళ్లి చేస్తారు. వాళ్లు గతంలోనే చనిపోయారు గనుక.. ఆత్మలకు వివాహం జరిపిస్తారన్న మాట. అదే ప్రేత కల్యాణం.





    ఆ పట్టణాన్ని ఏలియన్స్ ఆక్రమించేశారా? ఆకాశం గులాబీ రంగులోకి ఎందుకు మారింది?

    అక్కడ ఎవరూ ఉండరు. అలాగని బొమ్మలను పెట్టరు. వారి ఆత్మలు అక్కడ ఉన్నట్లుగా ఊహించుకొని వివాహ వేడుకను జరిపిస్తారు. కేవలం బట్టలు, కుర్చీలు మాత్రమే ఉంటాయి. ఓ పళ్లెంలో వధువు దుస్తులు, మరో పళ్లెంలో వరుడు దుస్తులుంటాయి. వాటిని రెండు కుర్చీలపై పెడతారు. అమ్మాయి తరపు నుంచి ఒకరు, అబ్బాయి తరపు నుంచి ఒక మగవారు వచ్చి... పూల మాలలు వేయడం, తాళి కట్టడం, ఏడుడుగులు వేయడం వంటివి చేస్తుంటారు. చిన్న పిల్లలు, పెళ్లి కాని వారు.. ఈ పెళ్లిని చూడడానికి వీల్లేదు. ప్రేత కల్యాణం జరిపించడానికి ఒక ముఖ్యమైన కారణముంది. ఎవరైనా పెళ్లి కాకుండా చనిపోతే.. వారి ఆత్మ శాంతించదట. మోక్షం లభించదట. అందుకనే కాన్పు సమయంలో చనిపోయిన వారికి.. యుక్త వయసు వచ్చాక పెళ్లి జరిపిస్తారు. ఇలా చేయడం వల్ల ఇరు కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రావని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ ప్రేత కల్యాణం సంప్రదాయం చాలా వింతగా ఉంది కదూ..!
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Karnataka, Marriage, VIRAL NEWS, Wedding

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు