Lalu Prasad: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కి బిగ్ రిలీఫ్ లభించినట్లైంది. జార్ఖండ్ హైకోర్టు ఇవాళ ఆయనకు దాణా కుంభకోణం కేసుకి సంబంధించిన ధంకా ట్రెజరీ కేసులో బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో భాగంగా... గత రెండున్నరేళ్లుగా లాలూ ప్రసాద్... జైల్లోనే ఉన్నారు. అదే సమయంలో... బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. RJD అధికారంలోకి వస్తుందనే అంచనాలు కూడా వచ్చాయి. ఐతే.. ఇప్పుడు ఆయనకు బెయిల్ లభించడం వల్ల... ఇక జైలు నుంచి బయటకు వచ్చినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే... ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్... ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అనారోగ్యంతో ట్రీట్మెంట్ పొందుతున్నారు.
ధంకా ట్రెజరీ కేసులో... లాలూ ప్రసాద్ యాదవ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ కొనసాగుతోంది. లాలూ బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. అది ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో లాలూ ఆల్రెడీ సగం కాలం... (శిక్ష వేస్తే ఉండే కాలంలో సగం)... జైల్లోనే ఉన్నందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన తరపు లాయర్లు కోరారు. దాంతో కోర్టు బెయిల్ ఇవ్వక తప్పలేదు.
ఇది కూడా చదవండి: Business Idea: సరైన మంచి వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారా... ఇది ట్రై చెయ్యండి
ఈ బెయిల్‌కి సంబంధించి... కోర్టుకు పూచీకత్తుతో కూడిన బాండ్ పేపర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు 2 లేదా మూడు రోజులు పట్టొచ్చు. ఐతే... ఇది నాలుగు రోజులు పట్టొచ్చని అంటున్నారు. కారణం కరోనా ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ వల్ల కాస్త ఆలస్యమైనా... ఆల్రెడీ ఆస్పత్రిలో ఉన్న లాలూ... అటు నుంచి అటే... ఇంటికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకు సంబంధించి ఆయన తరపు లాయర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో... ఆర్జేడీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. లాలూ ఇంటికి రాగానే... ఘనంగా వేడుకలు జరుపుతామని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lalu Prasad Yadav