BREAKING: జనరేటర్ నుంచి వచ్చిన పొగతో... ఊపిరి ఆడక ఆరుగురు చనిపోగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన... మహారాష్ట్రలో జరిగింది. అక్కడి చంద్రపూర్ నగరంలోని... దుర్గాపూర్‌లో... కరెంటు పోవడంతో... జనరేటర్ ఆన్ చేశారు. అయితే... దాని వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఎవరు ఊహిస్తారు. కానీ ఈ దురదృష్టకర ఘటన జరిగింది.
ఈ జనరేటర్‌ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. కరెంటు పోవడంతో... జనరేటర్ ఆన్ చేశారు. కుటుంబ సభ్యులంతా నిద్రలోకి జారుకున్నారు. ఐతే... జనరేటర్ నుంచి ఒక్కసారిగా పొగ వచ్చింది. దాంతో... కుటుంబ సభ్యులకు మెలకువ వచ్చేసరికే ఊపిరి ఆడని పరిస్థితి వచ్చేసింది.
అది డీజిల్ జనరేటర్ కావడంతో... పొగ చాలా ఎక్కువగా వచ్చింది. దాన్ని బయట ఏర్పాటు చేసుకొని ఉంటే బాగుండేది. ఇంట్లోనే పెట్టుకోవడంతో... దాని నుంచి వచ్చిన పొగ ఇల్లంతా కమ్మేసింది. పక్కింటి వాళ్లు ఆ పొగను చూసి... హడావుడిగా వెళ్లి.. వాళ్లను ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆరుగురు చనిపోయారని అర్థమైంది. మరో వ్యక్తిని మాత్రం ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
ఇది కూడా చదవండి: Video: సెలూన్‌లో యువతుల చిట్‌చాట్... ఒళ్లుమండిన బార్బర్ ఏం చేశాడో తెలుసా?
అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని 44 ఏళ్ల రమేష్ లష్కరే, 20 ఏళ్ల అజయ్ లష్కరే, 9 ఏళ్ల లఖాన్ లష్కరే, 8 ఏళ్ల కృష్ణ లష్కరే, 18 ఏళ్ల మాధురీ లష్కరే, 14 ఏళ్ల పూజా లష్కరేగా గుర్తించారు. 40 ఏళ్ల దాసు లష్కరే ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breaking news, Maharashtra, Viral