కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు యువత. కొందరు లవ్‌కి బ్రేకప్‌కి చెబితే..మరికొందరు మందును మానేస్తారు. ఇంకొందరు సిగరెట్‌కు గుడ్‌బై చెబుతారు. పంజాబ్‌కు చెందిన ఓ ఎంపీ కూడా ఇలాంటి త్యాగమే చేశాడట..! రాష్ట్రం కోసం, ప్రజల కోసం మందు మానేస్తున్నట్లు ప్రకటించి హాట్‌టాపిక్‌గా మారాడు. ఆయనే భగవంత్ మాన్..! ఆమాద్మీ చేసిన చేసిన ఈ ప్రకటనపై పంజాబ్ రాజకీయాల్లో సెటైర్లు పేలుతున్నాయి.
సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్..పంజాబ్ రాజకీయాల్లో ఆమాద్మీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. అంతేకాదు ప్రత్యర్థులు ఆయన్ను తాగుబోతు ఎంపీగా పిలుస్తుంటారు. ఎందుకంటే బహిరంగ సభలకు ఆయన మందుకొట్టి వస్తారు. తాగి వేదికలపైన పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఏకంగా పార్లమెంట్‌కే మద్యంతాగి వెళ్లారని భగవంత్ మాన్‌పై విమర్శలున్నాయి. ఆయనతో మందుకంపు వాసన వచ్చేదని..భగవంత్ మాన్ పక్కన కూర్చున్న ఎంపీలు పలుమార్లు ఆరోపించారు.
ఆయనపై, ఆమాద్మీ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు భగవంత్ మాన్. ఆదివారం ఓ సభకు హాజరైన ఆయన.. తాను తాగుడు మానేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై జీవితంలో మందు ముట్టుకోబోనని ప్రమాణం చేశాడు. పంజాబ్ కోసమే ఈ మహా త్యాగం చేశానని చెప్పుకొచ్చారు.
భగవంత్ మాన్ నిర్ణయంపై ఢిల్లీ సీఎం, ఆమాద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తంచేశారు. ప్రజల కోసం ఏ త్యాగానికైనా ఆప్ నేతలు సిద్ధంగా ఉంటారని కొనియాడారు. భగవాన్ మాన్ తనతో ప్రజల హృదయానలు కొల్లగొట్టారని ప్రశంసించారు. కాగా, బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయనపై సెటైర్లు వేశారు. తాగుడు మానేయడం కూడా గొప్ప త్యాగమా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
గతంలో పలు చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన భగవంత్ మాన్..2011లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ నుంచి రాజకీయ అరంగ్రేటం చేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మాజీ సీఎం రాజిందర్ కౌర్ భట్టల్పై లెహ్రా నియోజకవర్గంలో పోటీ చేశారు. ఐతే 2014లో పీపుల్స్ పార్టీ ఆప్ పంజాబ్ చీఫ్ మన్‌ప్రీత్ బాదల్ కాంగ్రెస్‌లో చేరిపోవడంతో..భగవంత్ మాన్ ఆమాద్మీ గూటికి చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. అకాలీదళ్ నేత సుఖ్‌దేవ్ సింగ్‌పై 2 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.