మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..

మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

విక్రయాలు ప్రారంభమవుతాయనుకున్న ఒక్కరోజు ఈ కామర్స్ సంస్థలు నిత్యావసర వస్తువులు కాకుండా ఇతర వస్తువులను విక్రయించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.

  • Share this:
    లాక్‌డౌన్ ముందురోజు వరకు ఆన్‌లైన్ షాపింగ్ కళకళలాడింది. కానీ కరోనా వైరస్ దెబ్బకు ఈ కామర్స్ సంస్థలన్నీ బేజారయిపోయాయి. దాదాపు నెల రోజుల పాటు షాపింగ్ అంతా నిలిచిపోయింది. దీంతో ఈ కామర్స్, డెలివరీ సంస్థలు బోసిపోయాయి. అయితే ఈనెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ నిబంధనలు కొంతమేర సడలింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఎలక్ట్రానిక్ వస్తువులు, స్టేషనరీ ఉత్పత్తుల విక్రయాలు జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే విక్రయాలు ప్రారంభమవుతాయనుకున్న ఒక్కరోజు ఈ కామర్స్ సంస్థలు నిత్యావసర వస్తువులు కాకుండా ఇతర వస్తువులను విక్రయించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.

    ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మే 3 వరకు లాక్‌డౌన్ పొడగించిన నేపథ్యంలో ఈనెల 20వ తేదీ నుంచి పలు రంగాలకు మినహాయింపు ఇస్తున్నట్టు గతంలో ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో భాగంగానే ఈ కామర్స్ సంస్థలు ఔషధాలు, ఔషధ పరికరాలు, ఆహారం, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిని విక్రయించేందుకు అనుమతినిచ్చారు. కానీ తాజాగా ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించొద్దని కేంద్రం తెలిపింది. దీంతో 20వ తేదీ నుంచి కొనసాగుతాయనుకున్న ఆన్‌లైన్ షాపింగ్ నిలిచిపోయింది.
    Published by:Narsimha Badhini
    First published: