ఈసారి రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథి ఈయనే... ఇవీ విశేషాలు...

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను కేంద్ర ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఎందుకో తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 24, 2020, 11:11 AM IST
ఈసారి రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథి ఈయనే... ఇవీ విశేషాలు...
జైర్ బోల్సోనారో
  • Share this:
భారత దేశ గణతంత్ర దినోత్సవాలంటే ఆషామాషీ కాదు. మన దేశ ఆయుధ సంపత్తిని ప్రదర్శించే ఘట్టం ఇందులో కీలకం. అందువల్ల ఈ రిపబ్లిక్ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఎవర్ని ఆహ్వానించినా అదో పెద్ద న్యూస్. ఈసారి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ప్రపంచంలో 195కి పైగా దేశాలుంటే... దక్షిణ అమెరికా... తూర్పున ఉండే అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌నే ఎందుకు ఎంచుకున్నారో మాట్లాడుకుందాం. 2004లో అప్పటి భారత ప్రభుత్వం బ్రెజిల్ అధ్యక్షుణ్ని చీఫ్ గెస్టుగా పిలిచింది. మళ్లీ ఇప్పుడు రిపీటైంది. ఓవరాల్‌గా బ్రెజిల్ అధ్యక్షులకు ఇది మూడో అవకాశం. అందువల్ల బోల్సోనారో... జనవరి 24న ఇండియా వచ్చి 27 వరకూ ఉండి... రిపబ్లిక్ వేడుకల్ని ఫుల్లుగా చూస్తారు. ఆయనతోపాటూ... 8 మంది బ్రెజిల్ మంత్రులు, 4 ఎంపీలు, సీనియర్ అధికారులు కూడా వెంట వస్తారు.

బ్రెజిల్ మ్యాప్


బోల్సోనారో జనవరి 1, 2019న అధ్యక్షుడయ్యారు. ఇంతకు ముందు రెండుసార్లు ఆయన ప్రధాని మోదీని కలిశారు. డార్క్ చాకొలెట్స్ బాగా తయారుచేసే... బ్రెజిల్ మనకు ఫ్రెండ్లీ దేశం. పైగా రెండూ అభివృద్ధి చెందుతున్న దేశాలే. రెండూ పెద్ద దేశాలే. రెండూ కూడా బ్రిక్స్, IBSA, G20లో సభ్య దేశాలే. ఐక్యరాజ్యసమితిలో జిగినీ దోస్తుల్లా ఉంటాయి. లాటిన్ అమెరికాలో పెద్ద దేశమైన బ్రెజిల్ జనాభా... 21 కోట్లు. సహజ వనరులకు లెక్కలేదు. ఆయిల్, గ్యాస్ బోలెడంత ఉంది. బ్రెజిల్ సప్లై చేస్తున్న ఇథనాల్ చాలా నాణ్యమైనదిగా ట్రాక్ రికార్డ్ ఉంది.

బ్రెజిల్-భారత్ మధ్య వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్, స్పేస్ రంగాల్లో సహకారం ఉంది. భారత్... బ్రెజిల్‌కి ఆగ్రోకెమికల్స్, సింథటిక్ యార్న్స్, ఆటో పార్ట్స్, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. బ్రెజిల్ మనకు... క్రూడ్ ఆయిల్, బంగారం, వెజిటబుల్ ఆయిల్, ఖనిజాలు, ముడి ఖనిజాల్ని ఎగుమతి చేస్తోంది. ఇండియాలో బ్రెజిల్... 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే... రెండు దేశాల మధ్యా చాలా సత్సబంధాలున్నాయి. అందుకే ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో బోల్సోనారోను పిలిచి... ఘనంగా స్వాగతం పలికేయబోతున్నాం. తద్వారా ఆ దేశంతో మన సంబంధాలు మరింత బలపడతాయి.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు