హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bappa Saha: కూలీ కుమారుడు యూపీఎస్సీ టాపర్..ISSEలో రెండో ర్యాంక్ సాధించిన బప్ప సాహ- అనన్య దే

Bappa Saha: కూలీ కుమారుడు యూపీఎస్సీ టాపర్..ISSEలో రెండో ర్యాంక్ సాధించిన బప్ప సాహ- అనన్య దే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్నేళ్ల వరకు అతని ఇంటికి విద్యుత్ సదుపాయం కూడా ఉండేది కాదు. ఇప్పుడు అతని విజయం చూసి ఆ గ్రామంలోని అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. అతను సాధించిన విజయం అలాంటిది మరి.. ఓ కూలీ కుమారుడు యూపీఎస్సీ పరీక్షలో రెండో ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Bappa Saha : కొన్నేళ్ల వరకు అతని ఇంటికి విద్యుత్ సదుపాయం కూడా ఉండేది కాదు. ఇప్పుడు అతని విజయం చూసి ఆ గ్రామంలోని అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. అతను సాధించిన విజయం అలాంటిది మరి.. ఓ కూలీ కుమారుడు యూపీఎస్సీ పరీక్షలో రెండో ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు. అతనే పశ్చిమ్‌ బెంగాల్‌లోని అలిపుర్‌దావార్ జిల్లాకు చెందిన బప్పా సాహ. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పరీక్షలో సెకండ్ ర్యాంక్ సాధించాడు. స్ఫూర్తిదాయకమైన అతని సక్సెస్‌ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.

స్వగ్రామం నుంచి ఢిల్లీకి

బప్ప సాహ సాధించిన విజయం వెనకాల ఎంతో కృషి, పట్టుదల ఉంది. అలిపర్‌దువార్ పక్కనే ఉన్న మజేర్‌దబ్రీలోని ఓ నిరు పేద కుటుంబంలో బప్పా జన్మించాడు. స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతరం అలిపర్‌దువార్‌లోని గోవింద హైస్కూల్‌లో చేరాడు. 2016లో సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత నార్త్ బెంగాల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వ్యవసాయంలో బీఎస్సీ కంప్లీట్ చేశాడు. మంచి మార్కులు రావడంతో న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్‌లో చేరి అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ విభాగంలో పీజీ పూర్తి చేశాడు.

పీజీ చదువుతూనే ప్రిపరేషన్‌

ఓ వైపు పీజీ చేస్తూనే యూపీఎస్సీ ప్రకటించిన ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పరీక్షలకు బప్పా అప్లై చేశాడు. రాత్రి, పగలు పట్టుదలతో చదివి 2022 జూన్‌లో రాత పరీక్షకు హాజరయ్యాడు. రెండు నెలల్లోనే వాటి ఫలితాలు వచ్చాయి. మంచి మార్కులతో ఇంటర్యూకు ఎంపికయ్యాడు . 2022 డిసెంబర్ 19న న్యూఢిల్లీలోని యూపీఎస్సీ భనంలో బప్పా ఇంటర్యూకు హాజరయ్యారు. ఇంటర్య్యూ పూర్తయిన మూడు వారాల్లోనే ఫలితాలు విడుదల అయ్యాయి. యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పరీక్షలలో బప్పా రెండో ర్యాంకును సాధించాడు. బప్పా విజయంతో స్వగ్రామం సౌత్ మాదేర్‌దబ్రీలో సందడి నెలకొంది. ఆ ఏరియా ప్రజలు బప్పా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం వాడు కావడంతో అక్కడి ప్రజలు గర్వంగా ఫీల్ అవుతున్నారు.

పేద పిల్లలను చదివిస్తా..

తాను సాధించిన విజయంపై బప్పా సాహ మాట్లాడాడు. తనకు ఈ పరీక్ష గురించి బీఎస్సీ చదువుతున్నప్పుడు తెలిసిందని అన్నాడు. అప్పటి నుంచి ప్రిపరేషన్‌ను మొదలుపెట్టినట్లు చెప్పాడు. సాధారణంగా చదివానని ప్రత్యేకంగా ఎలాంటి టార్గెట్‌ పెట్టుకోలేదని చెప్పాడు. తన విజయానికి ప్రధాన కారణం గురువులు, తల్లిదండ్రులేనని చెప్పుకొచ్చాడు. ఉద్యోగంలో చేరిన తరువాత తన ప్రాంతంలో ఉన్న అట్టడుగు వర్గాల పిల్లలను, విద్యార్ధులను చదవిస్తానని, అవసరమైన శిక్షణ ఇస్తానని పేర్కొన్నాడు.

Success Story : ఒకప్పుడు భారత్ లో బీడీలు చుట్టేవాడు..ఇప్పుడు అమెరికాలో జడ్జి అయ్యాడు

తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు

బప్పా సాహది చాలా పేద కుటుంబం. తండ్రి గోపాల్ సాహ కూలీగా పని చేస్తాడు. తల్లి లక్ష్మీ సాహ గృహిణి. సోదరి బర్నాలి సాహ బీఈడీ పూర్తి చేసింది. చిన్న వయసు నుంచే బప్పా సాహ పేదరికంలో ఉంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడని స్థానికులు చెప్పారు. కొన్నేళ్ల ముందు వరకు బప్పా ఇంట్లో విద్యుత్తు కూడా ఉండేది కాదన్నారు. రోజు గడవడానికే కుటుంబం ఎంతో కష్టపడేది. ఇప్పుడు బప్పా సాహ దేశంలోనే రెండో ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం సంపాదించడం తో కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.

First published:

Tags: Success story

ఉత్తమ కథలు