విక్రమ్ ల్యాండర్ చూశారా... వ్యోమగామికి హాలీవుడ్ హీరో ఫోన్

వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయానికి బ్రాడ్‌పిట్‌ వెళ్లారు. అక్కడి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడియో కాల్‌ చేశారు.

advertorial
Updated: September 17, 2019, 4:07 PM IST
విక్రమ్ ల్యాండర్ చూశారా... వ్యోమగామికి హాలీవుడ్ హీరో ఫోన్
విక్రమ్ ల్యాండర్‌పై ఆరా తీసిన హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్
advertorial
Updated: September 17, 2019, 4:07 PM IST
చంద్రయాన్-2‌పై దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద స్థాయిలో చర్చ జరుగూతూనే ఉంది. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా.... చందమామ దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఎంతకీ స్పందించట్లేదు. చివరకు నాసా శాస్త్రవేత్తలు డీప్ స్పేస్ యాంటెన్నాలతో ప్రయత్నించినా... ల్యాండర్ నుంచీ ఎలాంటి సిగ్నల్సూ రాలేదు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ కూడా విక్రమ్ ల్యాండర్‌పై ఆరా తీశాడు. ‘విక్రమ్ ల్యాండర్‌’ను చూశారా అంటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉన్న అమెరికా వ్యోమగామికి ఫోన్‌ చేసి అడిగారు.

వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయానికి బ్రాడ్‌పిట్‌ వెళ్లారు. అక్కడి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడియో కాల్‌ చేశారు. వ్యోమగామి నిక్‌ హేగ్‌తో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. అంతరిక్షంలోని పరిస్థితుల గురించి బ్రాడ్‌ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ‘అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది, అక్కడ లైఫ్‌ ఎలా ఉంది’ లాంటివి అడిగి బ్రాడ్ పిట్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌ -2 గురించి కూడా బ్రాడ్‌ పిట్‌ వ్యోమగామితో ప్రస్తావించారు. జాబిల్లిపై ల్యాండర్‌ విక్రమ్‌ను గుర్తించారా? అని అడగ్గా.. ‘దురదృష్టవశాత్తు ఇంకా లేదు’ అని నిక్‌ హేగ్‌ సమాధానం చెప్పారు.




బ్రాడ్‌పిట్‌ హీరోగా ‘ఆడ్‌ ఆస్ట్రా’ పేరుతో సినిమా తీస్తున్నారు. ఇందులో బ్రాడ్‌ వ్యోమగామిగా మనకు కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బ్రాడ్ పిట్ నాసా కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వీడియో కాల్‌ను నాసా టీవీలో ప్రసారం చేశారు. బ్రాడ్‌ వ్యోమగామితో మాట్లాడుతున్న వీడియోను నాసా ట్విటర్‌లోనూ షేర్‌ చేశారు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...