హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Viral Video: ఏయ్.. నీ మాస్క్ ఏది.. కర్రతో బెదిరిస్తూ వారికి బుద్ధి చెప్పిన బుడ్డోడు..

Viral Video: ఏయ్.. నీ మాస్క్ ఏది.. కర్రతో బెదిరిస్తూ వారికి బుద్ధి చెప్పిన బుడ్డోడు..

మాస్క్ పెట్టుకోని వారిని నిలదీస్తున్న బాలుడు

మాస్క్ పెట్టుకోని వారిని నిలదీస్తున్న బాలుడు

వైరల్ వీడియోను చూసిన ధర్మశాల పోలీసులు అమిత్‌ను ప్రశంసించారు. అతడిని సత్కరించి పహారీ క్యాప్, స్నాక్స్, ఎనర్జీ డ్రింక్ అందజేశారు. అమిత్, అతడి సోదరులకు నెటిజన్లు బూట్లు, బట్టలు బహుమతిగా ఇచ్చారు.

కరోనా సెకండ్ వేవ్ తగ్గముఖం పట్టడంతో జనాల్లో మళ్లీ నిర్లక్ష్యం పెరిగింది. చాలా చోట్ల ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్ ధరించడం లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో కూడా ఇదే పరిస్థితి. ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించడంతో స్థానికులు, యాత్రికులు విచ్చల విడిగా తిరుగుతున్నారు. సిమ్లాలో అయితే ట్రాఫిక్ రద్దీ ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. ధర్మశాలలో సైతం వీధులు కిక్కిరిశాయి. నగరంలో ప్రజలు కోవిడ్ నిబంధనలను పక్కన పెట్టారు. అయితే ఇలా ఫేస్ మాస్క్‌లు లేకుండా బయట తిరుగుతున్న ప్రజలను ఒక బాలుడు నిలువరించాడు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించాడు. కర్రతో బెదిరిస్తూ వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలోని బాలుడి పేరు అమిత్. ఐదేళ్ల ఈ బుడ్డోడు రోడ్లపై బెలూన్లు అమ్ముతూ.. తల్లిదండ్రులకు సహాయం చేస్తుంటాడు. గత వారం ధర్మశాలలోని మెక్‌లోడ్గంజ్ సమీపంలో ఉన్న భగ్సునాగ్‌లో.. మాస్కులు ధరించని వారిని అమిత్ సున్నితంగా హెచ్చరించాడు. చెప్పులు లేకుండా, మాస్క్ ధరించి కనిపించిన బాలుడు.. చేతిలో ఒక ప్లాస్టిక్ లాఠీ పట్టుకొని, తనకు ఎదురుగా వస్తున్న వారిని ప్రశ్నించాడు. దీన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌ అయింది


‘మాస్కులు పెట్టుకోవాలని ప్రజలను పోలీసులు హెచ్చరించడం చూశాను. అందుకే నేను కూడా ఫేస్ మాస్కులు ధరించని వారిని హెచ్చరించాను’ అని పిల్లాడు చెబుతున్నాడు అమిత్.

వైరల్ వీడియోను చూసిన ధర్మశాల పోలీసులు అమిత్‌ను ప్రశంసించారు. అతడిని సత్కరించి పహారీ క్యాప్, స్నాక్స్, ఎనర్జీ డ్రింక్ అందజేశారు. అమిత్, అతడి సోదరులకు నెటిజన్లు బూట్లు, బట్టలు బహుమతిగా ఇచ్చారు. అతడు చేసిన పనిని చాలామంది నెటిజన్లు మెచ్చుకున్నారు. తాను పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు అమిత్.ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో నెలకొన్న వేడి వాతావరణాన్ని తట్టుకోలేక, చాలామంది హిమాచల్ ప్రదేశ్‌ యాత్రకు వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న యాత్రికులతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల వీధులు రద్దీగా మారాయి. దీంతో కరోనా మార్గదర్శకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆ రాష్ట్రానికి సూచించింది.

First published:

Tags: Corona virus, Coronavirus, Covid-19, Himachal Pradesh

ఉత్తమ కథలు