Home /News /national /

BOY FRIEND KILLED BY LOVER FATHER BY MISTAKE IN KERALA VRY

kerala : సినీ ఫక్కిలో ప్రియురాలి ఇంటికి చేరిన ప్రియుడు.. దొంగగా భావించి కత్తితో..

friend killed by  father

friend killed by father

kerala : తిరునంతపురంలో దారుణం జరిగింది. సిని ఫక్కిలో తన లవర్‌ను కలుసుకోవడం ఆమె ఇంటికి చేరుకున్న ప్రియుడిని దొంగగా భావించి హతమార్చారు.

    కొన్ని సంఘటనలు అనుకోకుండా సంచలనంగా మారతాయి..తాజాగా తిరువనంతపురంలో జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రియురాలి కోసం అర్థారాత్రి ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడు శవంగా మారాడు.. అది కూడా యువతి తండ్రి చేతిలో దారుణంగా హతమయ్యాడు.. అయితే అర్థరాత్రి ఇంటికి వచ్చిన ఆ యువకున్ని దొంగగా భావించడంతో యువతి తండ్రి దారుణంగా పొడిచి చంపాడు.

    కాగా ఈ సంఘటన కేరళ రాజధాని తిరువంతనపురంలో నేడు తెల్లవారుజామున చోటు చేసుకుంది. నగరంలోని లాలన్ అనే వ్యక్తికి ఓ కూతురు ఉంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన జార్జ్ అనే యువకునితో ప్రేమాయణం నడిపిస్తోంది. దీంతో జార్జ్ సినిమా ఫక్కిలో నేడు తెల్లవారుజామున మూడు గంటలకు ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి చేరుకున్నాడు. అయితే తనకి తెలియని జార్జ్ ఇంట్లోకి చేరుకుంటున్న చేరుకుంటున్న సమయంలోనే ఆ యువతి తండ్రి గమనించాడు. దీంతో జార్జ్‌ను దొంగగా భావించాడు. దీంతో ఆ దొంగను మట్టుబెట్టాలని వెంటనే భావించాడు. కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు.. ఈ క్రమంలోనే కత్తి తీసుకోని ఒక్కసారిగా జార్జ్‌ను కడుపులో పొడిచాడు. దీంతో కత్తిపోట్లకు గురైన జార్జ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో లాలన్ తానే స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.



    అయితే ఈ వార్త సోషల్ మీడియాకు చేరడంతో .పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. సమాచారం లేకుండా అర్థరాత్రి సయయంలో ఇలా వెళ్లడాన్నితప్పు పడుతున్నారు. మరోవైపు  దొంగతనానికి వచ్చినట్టు బావించినా ఇంత దారుణంగా హత్య చేయడంపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు.

    Nalgonada : ముందుగా ప్రభుత్వ ఉద్యోగి.. ఆ తర్వాత 6గురు స్నేహితులు.. యువతిపై లైంగిక దాడి. ఫలితంగా..!


    ఓ ఉగాండకు చెందిన ఓ మహిళా ఏకంగా సుమారు కిలో కొకైన్ క్యాప్యూల్స్‌ను కడుపులో దాచుకుని వచ్చింది. కొకైన్‌ను క్యాప్యూల్స్‌గా చేసి వాటిని మింగింది. ఆ తర్వాత ఉగండా నుండి ఢిల్లీ చేరుకుంది. భారత్‌లో విక్రయించేందుకు సిద్దమైంది. అయితే విమానాశ్రయంలో దిగిన ఆమెను పోలీసులు అనుమానంతో తనీఖీలు చేశారు. కడుపులో కొకైన్ క్యాప్యూల్స్ ఉన్నట్టు గుర్తించారు. అనంతరం వాటిని బయటికి తీశారు. ఆమె కడుపులో 91 క్యాప్యూల్స్ వెలికి తీశారు. వాటిలో 992 గ్రాముల కొకైన్ ఉన్నట్టు తెలిపారు. కాగా దాని విలువ సుమారు 14 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

    New year celebrations : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. పాల్గోనే వారు ఇవి పాటించాల్సిందే.. లేదంటే


    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Kerala, Lover, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు