Home /News /national /

BOREWELL CHILD DIES RESCUE OPERATION STOPPED IN TAMILNADU NK

బోరుబావిలో చిన్నారి మృతి... రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం

బోరుబావిలో చిన్నారి మృతి... కన్నీటి సంద్రమైన తల్లి

బోరుబావిలో చిన్నారి మృతి... కన్నీటి సంద్రమైన తల్లి

తమిళనాడు తిరుచ్చాపల్లిలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుర్జిత్‌ను కాపాడుకోలేకపోయాం. నాలుగు రోజులుగా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి.

    తమిళనాడు తిరుచ్చాపల్లిలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుర్జిత్‌ను కాపాడుకోలేకపోయాం. నాలుగు రోజులుగా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. బోరు బావి నుంచీ కుళ్లిపోయిన వాసన రావడంతో... చిన్నారి చనిపోయాడని గుర్తించిన ఫైర్ సిబ్బంది... క్రేన్ ద్వారా... మృతదేహాన్ని వెలికి తీశారు. చిన్నారి మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా 80 గంటలుగా చేసిన ఆపరేషన్ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం చిన్నారి బాడీ డీకంపోజింగ్ స్టేజీలో ఉంది. పిల్లాడి తల్లి... మృతదేహాన్ని చూసి కన్నీటి సంద్రమైంది. ఎప్పటికైనా బిడ్డను ప్రాణాలతో చూస్తాననుకున్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. చిట్టి తండ్రి ప్రాణాలతో బయటకు రావాలని దేశమంతా కోరుకుంది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దీనిపై స్పందించారు. చిన్నారిని త్వరగా బయటకు తేవాలని కోరారు. ఎవరు ఎంతలా ప్రయత్నించినా ఫలితం దక్కకుండా పోయింది.




    అంతా కలిపి రెండేళ్ల ప్రాయం. ప్రపంచం తెలియదు. ఇప్పుడిప్పుడే నడకలు వస్తున్నాయి. అలాంటి చిన్నారి... అనుకోకుండా... ఈ నెల 25న ఆ చిన్నారి బోరు బావిలో పడిపోయాడు. దురదృష్టం కొద్దీ ఆ బోరు బావిలో ఏకంగా 35 అడుగుల లోతుకు పడిపోయాడు.


    చిన్నారిని బయటకు తెచ్చేందుకు రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతుండగా మరింత లోతుకు జారి... ఏకంగా 90 అడుగుల లోతుకు వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా ఆహారం, నీరూ లేకుండా పోవడంతో... చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లి, చనిపోయాడు.

     

    Pics : బాలీవుడ్‌ను కట్టిపడేస్తున్న తన్యా గవ్రీ ఫ్యాషన్ డిజైన్స్




    ఇవి కూడా చదవండి :

    Health Tips : రేగుపండ్లు తింటున్నారా... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు


    Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

    Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

    Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు


    Health Tips : బరువు తగ్గాలా... అలోవెరాతో ఇలా చెయ్యండి...

    First published:

    Tags: Borewell, Telugu news, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు