• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BOOKS AGAINST MOHOR WEST BENGAL MURSHIDABAD BRIDE TIES NUPTIAL KNOT TO BOOKS FAMILIES AGREE EVERYONE HAPPY NK

Books against mohor: పెళ్లిలో కట్నంగా బుక్స్... వధువుపై ప్రశంసల జల్లు

Books against mohor: పెళ్లిలో కట్నంగా బుక్స్... వధువుపై ప్రశంసల జల్లు

పెళ్లిలో కట్నంగా బుక్స్... వధువుపై ప్రశంసల జల్లు (ప్రతీకాత్మక చిత్రం)

Books as mohor: వరుడి నుంచి ఆమె కట్నంగా పుస్తకాలు ఎందుకు కోరింది? ఈ ఆదర్శనీయమైన పెళ్లి ఎక్కడ జరిగింది? తెలుసుకుందాం.

  • Share this:
    బెంగాల్... ముర్షిరాబాద్ జిల్లాలోని సూతీలో నివసిస్తున్న... కల్యాణీ యూనివర్సిటీలోని DN కాలేజీలో ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ చేస్తున్న వధువు మొయినా ఖాటున్ (Moyna Khatun) టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యింది. మైనార్టీ ఆధిపత్యం ఉండే ఏరియాలో ఆ 24 ఏళ్ల వధువు సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ఇచ్చే కట్నం (mohor) వద్దంటూ... వాటి బదులు 60 పుస్తకాలు ఇవ్వాలంది. అందుకు వరుడు ఒప్పుకున్నాడు. సోమవారం వివాహం జరిగింది. బీహార్‌లోని భాగల్పూర్ యూనివర్శిటీలో జాగ్రఫీ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల మీర్జానూర్ రెహ్మాన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. జనవరిలో ఈ పెళ్లిని పెద్దలు కుదుర్చుతున్న సమయంలోనే మొయినా... తన నిర్ణయాన్ని పెద్దలకు చెప్పింది. సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నా... వారు ఆనందంగా స్వాగతించారు.

    "సంప్రదాయంగా ఇచ్చే మొహర్‌ తీసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. ఈ రోజుల్లో అది రూ.50,000 దాకా ఉంది. మొదట ఈ విషయం తెలిశాక... వరుడి పేరెంట్స్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పుస్తకాలు ఇమ్మందని తెలిశాక... ఎంతో ఆనందించారు" అని మొయినా కుటుంబ సభ్యులు ఒకరు తెలిపారు.

    పెళ్లి కూతురి ఆదర్శప్రాయ నిర్ణయాన్ని ఆనందంగా స్వాగతించిన వరుడి కుటుంబ సభ్యులు... ఆమె కోరిన దాని కంటే ఎక్కువ పుస్తకాలే ఆమెకు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం మొయినా సొంత గ్రామమైన కిద్దేర్పోర్‌లో ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికులు చూశారు. పెళ్లి తర్వాత వధువు తరపు కుటుంబ సభ్యులంతా పుస్తకాలతో కనిపించారు. ఆమెకు దాదాపు 80 పుస్తకాలు ఇచ్చారు. వాటిలో బెంగాలీ ఖురాన్, రవీంద్రనాథ్ ఠాకూర్, నజ్రుల్ ఇస్లామ్, విభూతిభూషణ్ బంధోపాధ్యాయ్ రచనలు ఉన్నాయి.

    ఈ సందర్భంగా వరుడి తరపు కుటుంబ సభ్యులు... పెళ్లి కూతురు ఖర్చు కోసం కొంత డబ్బు కూడా ఇష్టపడి ఇచ్చినట్లు తెలిసింది. పుస్తకాలు ఇచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఇది కూడా చదవండి: Olive Oil Health Benefits: ఆలివ్ ఆయిల్‌తో ఎన్ని ప్రయోజనాలో...

    ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసింది. మైనార్టీ అమ్మాయిల్లో వస్తున్న మార్పు, సమాజంలో వస్తున్న మార్పును వారు స్వాగతించారు. ఐతే... ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బాలబాలికలంతా స్కూళ్లకు వెళ్లి చదువుకుంటే... మొయినా లాగా ఆదర్శప్రాయ నిర్ణయాలు తీసుకొని... సమాజాన్ని ప్రభావితం చెయ్యగలరని అన్నారు. స్థానిక పత్రికలు కూడా మొయినాను మెచ్చుకుంటూ కథనాలు రాశాయి.
    Published by:Krishna Kumar N
    First published: