IRCTC Tatkal Autofill: తత్కాల్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ

IRCTC Tatkal Autofill form | ఐఆర్‌సీటీసీ తత్కాల్ ఆటోఫిల్ ఫామ్ టూల్ గురించి కొద్దిమందికే తెలుసు. మీరు కూడా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఈ టూల్ ఉపయోగించుకుంటే వీలైనంత వేగంగా టికెట్ పొందే అవకాశముంటుంది.

news18-telugu
Updated: January 24, 2019, 5:20 PM IST
IRCTC Tatkal Autofill: తత్కాల్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ
IRCTC Tatkal Autofill: తత్కాల్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ
news18-telugu
Updated: January 24, 2019, 5:20 PM IST
railతరచూ రైల్వే టికెట్లు బుక్ చేసేవారికి ఐఆర్‌సీటీసీ గురించి తెలుసు. అయితే ఐఆర్‌సీటీసీలో తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం పెద్ద సవాల్. క్షణాల్లో బుక్ అయిపోయే టికెట్లను పొందడం కత్తి మీద సామే. ఎందుకంటే మొదట బుక్ చేసినవారికే తత్కాల్ టికెట్లు లభిస్తాయి. బుకింగ్ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేసినా టికెట్ మిస్సైనట్టే. ఏసీ క్లాస్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్‌ ఉదయం 11 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. టికెట్ బుక్ చేయాలంటే ఐడీ, పాస్‌వర్డ్, జర్నీ ప్లానర్, ట్రెయిన్ సెలక్షన్, ప్రయాణికుల వివరాలు, పేమెంట్ ఆప్షన్స్ ఇలా అన్నీ ఒక్కోటి పూర్తి చేసుకుంటూ వెళ్లాలి. ఇందుకోసం చాలా సమయం పడుతుంది. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అన్నట్టు ఎవరైతే ఇవన్నీ వేగంగా చేస్తారో వాళ్లకే తత్కాల్ టికెట్లు లభిస్తాయి. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్‌ను వేగవంతం చేసే టూల్ ఒకటి ఉంది. అదే IRCTC Tatkal Autofill Form Tool.

ఇవి కూడా చదవండి:

Channel Selector Application: ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...



ఐఆర్‌సీటీసీ తత్కాల్ ఆటోఫిల్ ఫామ్ టూల్ గురించి కొద్దిమందికే తెలుసు. మీరు కూడా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఈ టూల్ ఉపయోగించుకుంటే వీలైనంత వేగంగా టికెట్ పొందే అవకాశముంటుంది. IRCTC Tatkal Autofill Form Tool ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

ముందుగా IRCTC Tatkal Autofill form ఓపెన్ చేయండి.
ప్రయాణికుల వివరాలు ఫిల్ చేసి Submit Details button పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఆటోఫిల్ బటన్‌ను మీ బ్రౌజర్‌లోని టూల్‌బార్‌లో బుక్‌మార్క్స్‌లోకి డ్రాగ్ చేయండి.
తత్కాల్ బుకింగ్ సమయంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అప్పటికే బుక్‌మార్క్ చేసిన ఆటోఫిల్ బటన్‌పైన క్లిక్ చేయండి. మీరు అంతకు ముందే వివరాలన్నీ ఫిల్ చేసి ఉంటారు కాబట్టి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మళ్లీ అవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు.
IRCTC కొత్త వెబ్‌సైట్‌కు కూడా IRCTC Tatkal Autofill form సపోర్ట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

Paytm Offer: డబ్బులు లేకపోయినా పేటీఎంలో రూ.60,000 షాపింగ్

WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?
First published: January 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...