భారతదేశంతో పాటు ఆసియాలోనే పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా గుర్తింపు సాధించింది ‘ది బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్’ (BSE). 28 అంతస్తుల ఫిరోజ్ జీజీబోయ్ టవర్స్‌లో (Phiroze Jeejeebhoy Towers) బీఎస్‌ఈ ఉంది. ఇది ఆసియాలో స్థాపించిన మొట్టమొదటి స్టాక్ ఎక్స్ఛేంజ్. 1875, జులై 9న బీఎస్‌ఈని స్థాపించారు. అప్పట్లో స్థానిక షేర్లు, స్టాక్ బ్రోకర్ల క్యారెక్టర్, స్టేటర్, ఇంట్రస్ట్‌ను ప్రొటెక్ట్ చేయడానికి ఒక అసోసియేషన్‌ను ఏర్పాటు చేయాలనే తీర్మానాన్ని బాంబే(Mumbai) బ్రోకర్ల బృందం ఆమోదించింది. ఈ తీర్మానం ఆధారంగా బీఎస్‌ఈని ఏర్పాటు చేశారు. దక్షిణ బొంబాయిలోని టౌన్ హాల్ సమీపంలోని ఒక మర్రిచెట్టు కింద నుంచి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పనిచేయడం ప్రారంభించింది. ఈ 147 ఏళ్ల నాటి ఎక్స్ఛేంజ్ 1980లో PJ టవర్స్‌కు మారింది.
1957 ఆగస్టులో సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ కింద BSE భారత ప్రభుత్వ గుర్తింపు పొందింది. ఇలా ప్రభుత్వ గుర్తింపు పొందిన మొదటి స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా బీఎస్‌ఈ చరిత్ర సృష్టించింది. గత 147 సంవత్సరాలలో ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ చరిత్రలో BSE ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ హిస్టరీతో పాటు, బీఎస్‌ఈ సాధించిన రికార్డులను పరిశీలిద్దాం.
BSE చరిత్ర
కాటన్ కింగ్ లేదా బిగ్ బుల్ ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ నేతృత్వంలో BSE ఏర్పాటైంది. దీని చరిత్ర 1855 నాటిది. అప్పటి టౌన్ హాల్ సమీపంలోని మర్రి చెట్టు కింద 22 మంది స్టాక్ బ్రోకర్లు సమావేశమై కార్యకలాపాలు ప్రారంభించారు. తరువాతి 10 సంవత్సరాలలో బ్రోకర్ల సంఖ్య పెరగడంతో వారు టౌన్ హాల్ నుంచి మెడోస్ స్ట్రీట్‌లోని మర్రి చెట్ల వద్దకు మారారు. పెరుగుతున్న బ్రోకర్ల సంఖ్యకు అనుగుణంగా ఇలా ఒక చోటు నుంచి మరొక ప్రదేశానికి మారాని తర్వాత, ఈ బృందం 1874లో దలాల్ స్ట్రీట్‌కు చేరుకొని, శాశ్వత ప్రదేశం నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాతి సంవత్సరం.. 1875 జులై 9న బ్రోకర్లు ది నేటివ్ షేర్ & స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇదే ఆ తర్వాత బీఎస్‌ఈగా మారింది.
కీలక మైలురాళ్లు
1887: 1875లో ఏర్పాటైన నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్‌ను అధికారిక సంస్థగా ఏర్పాటు చేశారు.
1921: బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియరింగ్ హౌస్‌ను ప్రారంభించారు.
1957: BSE సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) చట్టం (SCRA) కింద భారత ప్రభుత్వం నుంచి శాశ్వత గుర్తింపు పొందింది.
1986: భారతదేశ మొదటి ఈక్విటీ ఇండెక్స్, S&P BSE సెన్సెక్స్, బేస్ ఇయర్ 1978-79 =100తో ప్రారంభమైంది.
1987: ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్‌ను ప్రవేశపెట్టారు.
1989: BSE ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (BTI) ప్రారంభమైంది.
1990: మొదటి సారి S&P BSE సెన్సెక్స్ 1000 పాయింట్ల పైన ముగిసింది.
1992: S&P BSE సెన్సెక్స్ 4000 మార్కును అధిగమించింది.
1992: SEBI చట్టం, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT)లను స్థాపించారు.
1995: BSE బాంబే ఆన్‌లైన్ ట్రేడింగ్ సిస్టమ్ (BOLT) అనే స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్‌ను ప్రారంభించింది.
2000: సెబీ ఆమోదించిన డెరివేటివ్ కాంట్రాక్టులలో డెరివేటివ్ ట్రేడింగ్, సెటిల్‌మెంట్‌ను ప్రారంభించడానికి BSEకి SEBI అనుమతి మంజూరు చేసింది.
2001: BSE TECK ఇండెక్స్ ప్రారంభమైంది.
2007: సింగపూర్ ఎక్స్ఛేంజ్, డ్యుయిష్ బోర్స్‌లో BSE స్ట్రాటజిక్ పార్ట్నర్‌గా ఎదిగింది. సింగపూర్ ఎక్స్ఛేంజ్ బీఎస్‌ఈలో 5 శాతం వాటాను రూ.189 కోట్లకు కొనుగోలు చేసింది. జర్మనీకి చెందిన డ్యుయిష్ బోర్స్ కూడా ఇదే తరహాలో బీఎస్‌ఈలో 5 శాతం వాటాను రూ.189 కోట్లకు కైవసం చేసుకుంది.
2009: BSE స్టార్ MF పేరుతో మ్యూచువల్ ఫండ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.
2011: బోర్స్ పేరు ఇప్పుడు ఉపయోగిస్తున్న ‘BSE లిమిటెడ్’గా మారింది.
2013: BSE కరెన్సీ డెరివేటివ్స్ విభాగాన్ని ప్రారంభించింది.
2015: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ- CII, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌తో పాటు, BSE కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్లాట్‌ఫారమ్ 'Sammaan'ను ప్రారంభించింది.
2016: 140 సంవత్సరాల ఎక్స్ఛేంజ్ ప్రయాణం జ్ఞాపకార్థం, ఆసియాలోని పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్ సొంత పోస్టల్ స్టాంప్‌ను పొందింది.
2020: ఫ్రాంక్‌ఫర్ట్ బేస్డ్ డ్యుయిష్ బోయర్స్ తన మిగిలిన 1.75 శాతం వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా రూ. 44 కోట్లకు విక్రయించి BSE నుంచి నిష్క్రమించింది. BSE Ltd 2.67 శాతం ఈక్విటీని ఒక రోజు ముందుగా 65.88 కోట్ల రూపాయలకు విక్రయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT Returns, Mumbai, Sensex, Stock Market