Kangana Ranaut: కంగనా ఆఫీసు కూల్చివేతపై హైకోర్టు తీర్పు.. ప్రజస్వామ్య విజయం అన్న కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చెందిన కార్యాలయంలో కొంత భాగాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన ఘటనలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: November 27, 2020, 2:37 PM IST
Kangana Ranaut: కంగనా ఆఫీసు కూల్చివేతపై హైకోర్టు తీర్పు.. ప్రజస్వామ్య విజయం అన్న కంగనా
కంగనా రనౌత్ (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు(Kangana Rananut) చెందిన కార్యాలయంలో కొంత భాగాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన ఘటనలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఎంసీ(BMC) అధికారులు కంగనా కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనకు సంబంధించి కంగనాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇది చట్టాన్ని దుర్మార్గంగా వినియోగించడం తప్ప మరోకటి కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే కూల్చివేత వల్ల కలిగిన నష్టాన్ని కూడా ఆమెకు చెల్లించాలని బీఎంసీని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నష్ట పరిహారాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా అధికారిని కూడా నియమించనున్నట్టు తెలిపింది. "మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పౌరుల హక్కులకు వ్యతిరేకంగా, తప్పుడు కారణాలతో ముందుకు సాగారు. ఇది చట్టాన్ని దుర్మార్గంగా వాడుకోవడమే తప్ప మరొకటి కాదు. పౌరుల హక్కులను కాలరాసేలా చట్టాన్ని వినియోగించుకునే హక్కు ఎవరికి లేదు" అని జస్టిస్ ఎస్‌జే కథవల్లా, ఆర్‌ఐ చాగ్లాతో కూడి ధర్మాసనం పేర్కొంది.

ఇక, కోర్టు తీర్పుతో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా విజయం సాధించారని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. కోర్టు తీర్పుపై స్పందించిన కంగనా.. "ఓ వక్తి ప్రభుత్వాన్ని ఎదురించి గెలిచినప్పుడు.. అది వారి విజయం కాదని ప్రజాస్వామ్యం యొక్క విజయమని అన్నారు. నాకు ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అలాగే నన్ను చూసి నవ్వినవారికి కూడ ధన్యవాదాలు" అని కంగనా పేర్కొన్నారు.

సుశాంత్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తుకు సంబంధించి ముంబై పోలీసులపై, మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. ఈ క్రమంలోనే కంగనా రనౌత్ ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చడంపై అధికార శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముంబైలో ఎలా అడుగుపెడతావో చూస్తామంటూ ఎంపీ సంజయ్ రౌత్ సహా పలువురు నేతలు వార్నింగ్ ఇచ్చారు. శివసేన వ్యాఖ్యలకు అంతకుమించిన స్థాయిలో ఎదురుదాడి చేసింది కంగనా. సెప్టెంబర్ 9 ముంబైకి వస్తానంటూ.. దమ్ముంటే అడ్డుకోండని సవాల్ విసిరింది. చెప్పినట్లుగానే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇవాళ ముంబైకి వస్తోంది. చాలా రోజుల తర్వాత ముంబైలో అడుగుపెట్టనున్న కాంట్రవర్సీ క్వీన్‌కు బీఎంసీ షాకించ్చింది. అక్రమ నిర్మాణాల పేరుతో ఆమె ఇంటిని కూల్చివేత ప్రారంభించింది.


దీంతో కంగనా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న నివాసం వద్ద ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని, అంతేగాక కోవిడ్ సమయంలో ఎలాంటి కూల్చివేతలు చేయకూడద్దన్న కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషన్‌ వేసింది. అకారణంగా తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కూడా కంగనా తన పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కూల్చివేతపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కంగనా పిటిషన్‌పై సమాధానం చెప్పాలని బీఎంసీని ఆదేశించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.
Published by: Sumanth Kanukula
First published: November 27, 2020, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading