Home /News /national /

BOMBAY HC MAKES INTERESTING COMMENTS ON TITANIC MOVIE WHILE HEARING ON A PIL SEEKING COVID 19 VACCINATION FOR LAWYERS HSN

Bombay HC- Titanic Movie: టైటానిక్ సినిమా చూశారా? పిటిషనర్ ను ప్రశ్నించిన బాంబే హైకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘మీరు టైటానిక్ సినిమా చూశారా? అందులో కెప్టెన్ ఏం చేస్తాడో గుర్తుకు తెచ్చుకోండి. మునిగిపోతున్న ఓడ నుంచి అందరూ తమను తాము రక్షించుకునేంత వరకు ఎదురుచూస్తాడు. ఇక్కడ నేను కెప్టెన్ ను’.. ఈ మాటలు ఏ రాజకీయ నాయకుడో వాడినవి కాదు.

    ‘మీరు టైటానిక్ సినిమా చూశారా? అందులో కెప్టెన్ ఏం చేస్తాడో గుర్తుకు తెచ్చుకోండి. మునిగిపోతున్న ఓడ నుంచి అందరూ తమను తాము రక్షించుకునేంత వరకు ఎదురుచూస్తాడు. ఇక్కడ నేను కెప్టెన్ ను’.. ఈ మాటలు ఏదో సినిమాలో ఏ హీరోనో, ఏ రాజకీయ నాయకుడో వాడినవి కాదు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిపంకార్ దత్తా చేసిన వ్యాఖ్యలు. పలువురు న్యాయవాదులు వేసిన పిటిషన్ గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదులు వేసిన పిటిషన్ ను అడ్డంగా కొట్టేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటారా..? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది కదా. అందులో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మొదటి విడతగా కరోనా వ్యాక్సిన్ ను ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే జ్యుడిషియరీ సిబ్బందిని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలోకి చేర్చాలని కొందరు న్యాయవాదులు ఓ పిటిషన్ దాఖలు చేశారు.

    ’కరోనా కాలంలో కూడా మేం ఎన్నో కేసులు వాదించాం. అంతకుముందులాగానే ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించాం. అందుకే జ్యుడిషియరీ సిబ్బందిని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలోకి చేర్చాలి. కరోనా వ్యాక్సిన్ అందించే విషయంలో వారికి కూడా ప్రాథాన్యం ఇవ్వాలి.‘ అంటూ వైష్ణవి ఘోలవే, యోగేష్ బోర్బాలే అని అడ్వకేట్లు ఓ గతీ వారం ఓ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇది కాస్తా బుధవారం బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దిపంకార్ దత్తా, జస్టిస్ కులకర్ణి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ పై విచారణలో చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
    ఇది కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ తీసుకునే నెల జీతం ఎంతో తెలుసా..? ఏ సీఎంకు ఎక్కువ జీతమంటే..

    ‘ప్రస్తుతం ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ విషయంలో సరైన విధానాన్ని అవలంబిస్తోంది. దాన్ని మేం అడ్డుకోవాలని ప్రయత్నించం. కరోనా సమయంలో డెలివరీ బాయ్స్, ఇతర ప్రైవేటు సంస్థలు కూడా యథావిథిగా పనిచేశాయి. మరి వాళ్లు కూడా మమ్మల్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండంటూ ఓ పిటిషన్ దాఖలు చేయొచ్చు కదా. పిటిషనర్లు మరీ సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నట్టు భావిస్తున్నాం. మీరు టైటానిక్ సినిమాను చూశారా? అందులో షిప్ కెప్టెన్ ఏం చేస్తాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మునిగిపోతున్న ఓడ నుంచి అందరూ తమను తాము రక్షించుకునేంత వరకు ఎదురుచూస్తాడు. ఇక్కడ నేను కూడా కెప్టెన్ ను. మన వంతు వచ్చేవరకు ఓపిగ్గా ఎదురుచూడాల్సిందే. మొదటగా ఎవరికి బాగా అవసరమో, వాళ్లకు కరోనా వ్యాక్సిన్ అందాలి. ఆ తర్వాతే జ్యుడిషియరీ సిబ్బంది వంతు వస్తుంది.‘ అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.
    ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్ కాల్ తో మటాష్.. ఏకంగా రూ.77 లక్షలు..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: AP High Court, Bombay, Crime news, Delhi High Court, Telangana

    తదుపరి వార్తలు