ప్రేమ కోసం... తాగిమత్తులో విమానానికి బాంబు బెదిరింపు కాల్

వెంటనే విమానాన్ని తనిఖలు చేశారు అధికారులు. ఫోన్ కాల్ చెన్నై నుంచి వచ్చినట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

news18-telugu
Updated: July 6, 2019, 1:35 PM IST
ప్రేమ కోసం... తాగిమత్తులో విమానానికి బాంబు బెదిరింపు కాల్
ఇండిగో విమానం(ఫైల్ ఫొటో)
  • Share this:
కోల్ కతా ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. విమానంలో బాంబు ఉందంటూ ఓ అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో హై అలర్ట్ ప్రకటించారు. వెంటనే విమానాన్ని తనిఖలు చేశారు అధికారులు. ఫోన్ కాల్ చెన్నై నుంచి వచ్చినట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

అయితే విమానంలో ఎలాంటి బాంబు లేనట్లు గుర్తించారు భద్రతా సిబ్బంది. ఎవరు ఎలాంటి భయబ్రాంతులకు గురికావద్దన్నారు. ఈమేరకు శంషాబాద్ డీఎస్పీ ప్రకాష్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఎయిర్ పోర్టులో ఎలాంటి ప్రమాదం లేదన్నారు. విమానాలన్నీ యథావిధిగా తిరుగుతాయన్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి.. ఎందుకిలా చేశాడన్న దానిపై విచారణ చేపట్టారు.

అయితే దర్యాప్తులో నకిలీ బెదిరింపు కాల్‌ వెనుక కారణం విని పోలీసులు షాక్‌ అయ్యారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లాల్సిన వ్యక్తే ఈ కాల్‌ చేసినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. ప్రేమలో విఫలమైన ఆ వ్యక్తి తాగిన మైకంలో ఈ బెదిరింపు కాల్‌ చేశాడని దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

First published: July 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>