హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bomb Threat: అమితాబ్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు! హై టెన్షన్

Bomb Threat: అమితాబ్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు! హై టెన్షన్

అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర (File- credit Instagram)

అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర (File- credit Instagram)

గతంలోనూ ఇలాంటివి జరిగాయి. ఉగ్రవాదులు ముంబైను టార్గెట్ చేసుకున్నారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ముంబైలోని అమితాబ్ బచ్చన్ బంగ్లా, ధర్మేంద్ర నివాసం సమీపంలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నాగ్‌పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. తరువాత బాంబ్ స్క్వాడ్ బృందాన్ని బిగ్ బి, ధర్మేంద్ర బంగ్లాలకు తరలించారు.ముంబై పోలీసులు వెంటనే అమితాబ్, ధర్మేంద్రల నివాసాల వద్దకు చేరుకొని తనిఖీలు చేశారు. అయితే అనుమానించదగిన వస్తువులేవీ కనిపించలేదు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. ఫోన్‌ కాల్‌ ఆధారంగా నిందితుల ఆచూకి తెలుసుకునే పనిలో పడ్డారు. ఇక పోలీసులు ముంబై నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు.

అమితాబ్ బచ్చన్‌కు ముంబైలో ఐదు విలాసవంతమైన ఇళ్లూన్నాయి. జల్సా, జనక్, వత్స, ప్రతీక్ష అని పేర్లుతో ఇళ్లున్నాయి. ముంబైలో బచ్చన్ దంపతులు కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ప్రతీష్క. అమితాబ్ తల్లిదండ్రులు నివసించిన ఇల్లు ఇది. ప్రస్తుతం ఈ కుటుంబం జల్సాలో నివసిస్తోంది. ఇక ముంబైలో ప్రముఖుల ఇళ్లపై దాడులు చేస్తామని బెదిరించడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. ఉగ్రవాదులు ముంబైను టార్గెట్ చేసుకున్నారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఇవి బ్లాయిక్ మెయిల్‌ కాల్సా లేక రియల్ కాల్సా అన్నది ప్రతీసారీ మిస్టరీగానే ఉంటుంది. పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉంటున్నారు. నగరంలో ఎవరు అనుమానంగా కనిపించిన క్వశ్చన్ చేస్తున్నారు.

మరోవైపు ధర్మేంద్ర జుహులోని ఓ బంగ్లాలో నివసిస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ త్వరలో టైగర్ ష్రాఫ్, కృతి సనన్‌లతో కలిసి 'గణపతి' మూవీలో కనిపించనున్నారు. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన గణపతి చిత్రాన్ని వాసు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్శిఖా దేశ్ ముఖ్, వికాస్ బహల్ నిర్మించారు. ఈ ఏడాది అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది. వీటితో పాటు ప్రభాస్ , దీపికా పదుకొణెలతో 'కె' ప్రాజెక్ట్ కూడా బిగ్ బీ చేతిలో ఉంది. దీపికతో కలిసి ఇంటర్న్ హిందీ రీమేక్ లో కూడా నటించనున్నాడు.

First published:

Tags: Amitabh bachchan