పంజాబ్ సీఎం భగవంత్ (punjab cm bhagavanth mon) మాన్ ఇంటి సమీపంలో లైవ్ బాంబు కలకలం రేపింది. చండీఘడ్ లోని సీఎం నివాసానికి 500 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ సమీపంలో బాంబు లభ్యం కావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కాగా బాంబు లభ్యమైన సమయంలో సీఎం ఆయన నివాసంలో లేరని తెలుస్తుంది. అయితే ఆ బాంబు అక్కడకు ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంబు లభ్యం కావడంతో సీఎం నివాసం చుట్టూ పక్కల ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. ఆర్మీ అధికారులు కూడా దీనిపై విచారణ చేయనున్నట్టు తెలుస్తుంది.
Bomb found near Punjab CM Bhagwant Mann's house in Chandigarh; bomb squad present at the spot pic.twitter.com/qrDCnBS2IF
— ANI (@ANI) January 2, 2023
చండీఘడ్ లోని కన్సల్, మొహాలీ నయా గావ్ బోర్డర్ వద్ద బాంబును పోలీసులు గుర్తించారు. దానిని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేశారు. ఇక ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.ఆ చుట్టు పక్కల ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఇక బాంబ్ ఘటనతో సీఎం ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం కూడా ఇక్కడికి కూతవేటు దూరంలో ఉంది.
కాగా బాంబు దొరికిన సమయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (punjab cm bhagavanth mon) అక్కడి నివాసంలో లేరని తెలుస్తుంది. ఒకవేళ ఆయన అక్కడ ఉన్న సమయంలో లేక రాకపోకలు చేస్తున్న సమయంలో బాంబు పేలి ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉండేదని అధికారులు చెప్పారు. ఇక ఈ బాంబు అక్కడకు ఎలా వచ్చింది? ఈ బాంబు ఎవరు ఇక్కడ పెట్టి ఉంటారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను అధికారులు పరిశీలించి క్లూస్ కోసం వెతుకుతున్నారు. అయితే సీఎంను టార్గెట్ చేసే ఈ బాంబు పెట్టారా లేక భయపెట్టేందుకు చేశారా అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Punjab