Amir khan: చిక్కుల్లో బాలీవుడ్​ స్టార్​ నటుడు అమీర్​ఖాన్​.. ఓ యాడ్​లో అమిర్​ హిందువులను కించ పరిచాడంటూ ఎంపీ ధ్వజం

అమీర్ ఖాన్ (Aamir Khan)

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన తాజాగా నటించిన ఓ యాడ్​ వివాదాలకు కేంద్రం అయింది. ఆ యాడ్‌పై బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే అభ్యంత‌రం వ్యక్తంచేశారు.

 • Share this:
  బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు ఆమీర్ ఖాన్‌ (Amir khan) చిక్కుల్లో పడ్డారు. ఆయన తాజాగా నటించిన ఓ యాడ్​ వివాదాలకు కేంద్రం అయింది. ఆ యాడ్‌పై బీజేపీ ఎంపీ (BJP MP) అనంత్‌కుమార్‌ హెగ్డే (Ananth Kumar hedge) అభ్యంత‌రం వ్యక్తంచేశారు. హిందువుల్లో (Hindus) అశాంతిని కల్పించే బదులు.. అన్నింటిపై అవగాహన కల్పించాలంటూ కర్ణాటకకు చెందిన ఎంపీ అనంత్‌కుమార్‌  సూచించారు. టైర్ల కంపెనీ సియెట్ రూపొందించిన ప్రకటనలో..  ఆమిర్ ఖాన్ (Amir khan)  రోడ్లపై ట‌పాసులు కాల్చవద్దంటూ ప్రజలను కోరుతుంటాడు. అయితే.. ఈ ప్రకటన హిందువుల్లో అశాంతిని సృష్టించేలా ఉందంటూ ద సియ‌ట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అనంత్ వర్ధన్ గోయంకాకు 14వ తేదీన ఎంపీ హెగ్డే లేఖ (letter) రాశారు. ఎంపీ లేఖలో..  మీ కంపెనీ ఇటీవల ప్రకటించిన ప్రకటన (Advertisement) లో అమీర్ ఖాన్ వీధుల్లో పటాకులు కాల్చకండి అంటూ ప్రజలకు సలహా ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై మీ స్పందనకు ధన్యవాదాలు. దీంతో పాటు రోడ్లపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.

  న‌మాజ్ పేరుతో రోడ్లను బ్లాక్..

  వారి ముఖ్యమైన పండుగల సమయంలో, శుక్రవారం  నాడు న‌మాజ్ పేరుతో రోడ్లను బ్లాక్ (blocking roads) చేయ‌డం, మ‌సీదుల నుంచి వ‌చ్చే భారీ శ‌బ్ధాల (loud sounds) వంటి సమస్యల గురించి కూడా కంపెనీ ప్రస్తావించాలని కోరారు. నమాజ్ సమయంలో రోడ్లను బ్లాక్ చేస్తారని.. అప్పుడు అంబులెన్స్‌లు (Ambulance), అగ్నిమాపక వాహనాలు వంటివి ట్రాఫిక్‌లో గంటలకొద్ది నిలిచిపోతున్నాయని హెగ్డే తెలిపారు.  హిందువుల్లో అల‌జ‌డి రేగుతోంద‌ంటూ..

  అమీర్ ఖాన్ న‌టించిన ఈ ప్రకటన (Ad)తో హిందువుల్లో అల‌జ‌డి రేగుతోంద‌ంటూ లేఖలో వివ‌రించారు. రాబోయే రోజుల్లో హిందువుల (Hindus) మ‌నోభావాల‌ను కంపెనీ గౌర‌విస్తుంద‌ని ఆశిస్తున్నానంటూ ఎంపీ లేఖలో వివరించారు.  ఎంపీ అనంతకుమార్  అభ్యంతరం వ్యక్తం చేయడంతో అమీర్ ఖాన్ నటించిన యాడ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

  కాగా, గత కొన్ని రోజులుగా హిందువులను కొన్ని శక్తులు కించపరుస్తున్నాయంటూ ఆయా సంఘాలు నిరసిస్తున్న సంగతి తెలిసిందే., ఇటీవలె బంగ్లాదేశ్​లోనూ హిందువులపై, అక్కడి హిందూ ఆలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.  బెంగాల్​లోనూ బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి.

  అక్కడ వారం రోజులుగా..

  బంగ్లాదేశ్‌ (Bangladesh). గత వారం రోజులుగా అల్లర్లతో అట్టుడికింది. దేవాలయాల (Temples)పై, హిందువుల (Hindus) పై దాడులు పెరిగాయి. అక్టోబర్ 13 న అక్కడి కొమిల్లా పట్టణం నుంచి ప్రారంభమైన హిందువులపై దాడులు బంగ్లాదేశ్ అంతటా అక్టోబర్ 17 వరకు కొనసాగాయి. ఈ సమయంలో హింస దారుణంగా జరిగింది. దుర్గా మండపాలను కూల్చివేశారు. హిందువుల ఇళ్లు కాలిపోయాయి. హిందువులపై దాడి జరిగింది.  అయితే ఈ దుర్గా పూజా మండపాలలో విగ్రహాల మధ్య ఖురాన్ (Quran) ఉంచడం ద్వారా హిందువులపై దాడుల కుట్రను పోలీసులు ఛేదించారు. బంగ్లాదేశ్ పోలీసులు కొమిల్లా పట్టణంలోని మండపం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో మందిరంలో ఖురాన్ ఉంచిన వ్యక్తిని గుర్తించారు. కాగా, ఇప్పటికే హిందూ సంఘాల బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులను సీరియస్​గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన అంశం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

  ఇవి కూడా చదవండి:  26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్​.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు  NFL​​లో 183 నాన్ ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే!
  Published by:Prabhakar Vaddi
  First published: