బాలీవుడ్లో బీజీపీ గాలి వీస్తోందా...

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:21 PM IST
బాలీవుడ్లో బీజీపీ గాలి వీస్తోందా...
narendra modi
  • News18
  • Last Updated: June 6, 2019, 2:21 PM IST
  • Share this:
ఓ రకంగా ఆలోచిస్తే సినిమాలూ- రాజకీయాల మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. రెండు చోట్లా విజయం సాధించడం చాలా కష్టమైన విషయం. గెలిస్తే నెత్తిన పెట్టుకుంటారు. ఓడిపోతే పట్టించుకునేవారే కరువవుతారు. తెర మీద కనిపించేవాళ్లు ఒకరైతే, తెర వెనక అసలు కథ నడిపించేవాళ్లు మరొకరు. ఇక్కడ బాక్సాఫీస్ కలెక్షన్లు విజయాన్ని డిసైడ్ చేస్తే, అక్కడ బ్యాలెట్ బాక్స్ కలెక్షన్లు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయిస్తారు. రెండు చోట్లా న్యాయనిర్ణేతలు ప్రజలే. అయితే దాదాపు రాజకీయాలను టచ్ చేసే సినిమాలన్నీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పథకాల అమలులో జరుగుతున్న అక్రమాలను నిలదీస్తూ సాగేవి. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ రూట్ మార్చింది. బాలీవుడ్లో బీజీపీ గాలి వీస్తోంది. జనతా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసిస్తూ పొగుడుతూ సినిమాలు రూపొందుతుండడమే దీనికి నిదర్శనం.


toilet ek prem katha


టాయ్ లెట్ ఏక్ ప్రేమకథ... అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం కూడా సాధించింది. అయితే ఈ సినిమా నేపథ్యం అందరికీ తెలిసిందే. మరుగుదొడ్డి నిర్మించాలని అత్తింటివారితో పోరాటం చేసే ఓ మహిళ కథ ఇది.‘స్వచ్ఛ భారత్ అభియాన్’ పేరుతో బీజీపీ ప్రభుత్వం చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ పథకాన్ని ప్రమోట్ చేసేలా ఉంటుందీ సినిమా. బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల కలిగే నష్టాలను స్పష్టంగా చూపించిన ఈ సినిమా ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించినట్టుగా ఉంటుంది.

parmanu


జాన్ అబ్రహం కొద్ది గ్యాప్ తీసుకుని నటించిన చిత్రం ‘పరమాణు- ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’. వాచ్ పేయ్ నాయకత్వంలో 1998లో చేపట్టిన రహస్య న్యూక్లియర్ పరీక్షలను సమర్ధిస్తూ సాగుతుందీ చిత్రం. అప్పుడు ఏం జరిగిందో వివరంగా చెప్పేందుకు, ఓ రకంగా న్యూక్లియర్ పరీక్షలపై పాజిటివ్ ఓపినీయన్ కల్పించేందుకు ఈ సినిమా రూపొందించినట్టుగా అనిపిస్తుంది.



Tiger Zinda Hai


హిట్లు లేక మొహం వాచిపోయిన సమయంలో బాలీవుడ్ కి మంచి విజయం సల్మాన్ ‘టైగర్ జిందా హై’. ఈ సినిమా కూడా పరోక్షంగా మోదీ ప్రభుత్వాన్ని పొడుగుతూ తీసిన సినిమానే. ఇరాక్ దేశంలోని ఐఎస్.ఐఎస్ తీవ్రవాదుల చేతిలో బందీగా ఉన్న 46 మంది నర్సుల ప్రాణాలను ఎలా కాపాడారనే ఆపరేషన్ గురించి చెబుతుందీ సినిమా. ఈ ఆపరేషన్ కూడా మోదీ ప్రభుత్వం చేపట్టిందే. ఇందులో పరోక్షంగా మోదీ గురించే డైలాగులు పెట్టారనే ప్రచారమూ జరిగింది.అంతేకాదు, అతి త్వరలో మోదీ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు పరేశ్ రావల్ స్క్రిప్టు పనులను ముగించే పనిలో ఉన్నాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో షూటింగ్ కి వెళ్లే ఈ సినిమాలో ఛాయ్ వాలా నుంచి నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఎదిగిన వైనాన్ని చూపించబోతున్నారట. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే మోదీ ప్రభుత్వాన్ని నెట్టిన పెట్టుకున్నట్టుగా బాలీవుడ్ ఇంతవరకూ ఏ ప్రభుత్వాన్ని సమర్థించలేదన్నది మాత్రం వాస్తవం.
Published by: Ramu Chinthakindhi
First published: June 5, 2018, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading