హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bollywood Drug Case: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముదురుతున్న మాట‌ల యుద్ధం..

Bollywood Drug Case: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముదురుతున్న మాట‌ల యుద్ధం..

స‌మీర్ వాంఖ‌డే (ఫైల్‌)

స‌మీర్ వాంఖ‌డే (ఫైల్‌)

Bollywood Drug Case: బాలీవుడ్ డ్ర‌గ్ కేసు (Bollywood Drug Case:) వ్య‌వ‌హారంలో రోజు రోజుకు రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య‌, ఇటు వాంఖ‌డే కుటుంబానికి మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకొంటున్నారు

బాలీవుడ్ డ్ర‌గ్ కేసు (Bollywood Drug Case) వ్య‌వ‌హారంలో రోజు రోజుకు రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య‌, ఇటు వాంఖ‌డే కుటుంబానికి మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకొంటున్నారు. డ్ర‌గ్ కేసు వ్య‌వ‌హారంలో రాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్ అండ‌ర్ వ‌ర‌ల్డ్‌ (Under World)తో సంబంధాలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫండ్న‌వీస్ ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై ఫడణవీస్‌ మహారాష్ట్ర (Maharashtra) ముఖ్య మంత్రిగా పనిచేశారు. హోం మం త్రిత్వ శాఖ కూడా ఆయన వద్దే ఉం ది. దీనిపై ఆయన అప్పు డే ఎం దుకు విచారణ జరపలేదు’ అని మాలిక్  ఎదురుదాడికి దిగారు. త‌న‌ను వేలెత్తి చూపే హ‌క్కు ఎవ‌ర‌కీ లేద‌ని ఆయ‌న అన్నారు. దీపావళి తర్వాత మాలిక్‌కు అండ‌ర్ వ‌రల్డ్‌తో ఉన్న సంబంధాలు బ‌హిర్గ‌తం చేస్తామ‌ని దేవంద్ర ఫండ్న‌వీస్ అన్నారు.

వాఖండే చొక్క ఖ‌రీదు రూ.70వేలు..

రాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్ ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాం ఖడేపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. అత‌ను నిజాయితీ ప‌రుడైతే రూ.లక్ష విలువైన ట్రౌజర్, రూ.70 వేల విలువైన చొక్కా , 25 నుం చి 30 లక్షల విలువైన చేతి గడియారాలు ఎలా ధ‌రిస్తాడ‌ని ఆరోపించారు. అక్రమం గా కొం దరిని కేసుల్లో ఇరికిం చి, వాంఖ‌డే కోట్లకు పడగలెత్తాడ‌ని అన్నారు. ఈ తరహా పనులు చేయడానికి ఆయనకు ప్రైవేటుగా కొం దరు వ్యక్తులున్నార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు.

By Elections in India : ఓట‌రు నాడి విభిన్నం.. 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల వివ‌రాలు


ఇదీ మా ఆహారం..

మంత్ర ఆరోప‌ణ‌ల‌పై ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య క్రాంతి రేడ్కర్ వాంఖడే స్పందించారు. దీనిపై ఆమె ట్వీట్ చేశారు.

‘మేం ఈ రోజు మధ్యా హ్న భోజనంలో దాల్‌ మఖ్నీ, జీరా రైస్ తీసుకున్నాం. జీరా రైస్ ఇంట్లో తయారు చేసిందే. దాల్ మఖ్నీ బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం. దాని ధర రూ.190. మళ్లీ

భవిష్యత్తులో ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారికి సాధ్యం కాని రీతిలో మేం ఆహారానికి ఖర్చు చేస్తున్నాం అనొచ్చు. అందుకే ఆధారాలతో సహా వెల్లడిస్తున్నాను’ అని ఆమె వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.  త‌న చొక్క విలువ రూ.70 వేలు, రూ. లక్ష విలువైన ట్రౌజర్, లక్షల విలువ చేసే చేతి గడియారాలు ధరిస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌లు స‌మీర్ వాంఖ‌డే ఖండించారు. ఇవ‌న్ని ఉత్త పుకార్ల‌ని వారికి తెలియ‌కుండా మాట్లాడుతున్నార‌ని అన్నారు.

First published:

Tags: Aryan Khan, Aryan khan drugs case, Bollywood drugs case, Maharastra Govt

ఉత్తమ కథలు