నీరుని దారుణంగా కొట్టి పరారైన కోహ్లి..

బాలీవుడ్ నటుడు, బిగ్‌ బాస్‌ మాజీ  కంటెస్టెంట్  అర్మాన్‌ కోహ్లి,  తన గర్ల్ ఫ్రెండ్  నీరూ రంధావా పై  తీవ్రంగా  దాడి చేసి  గాయపరిచాడు

news18
Updated: June 6, 2018, 2:37 PM IST
నీరుని దారుణంగా కొట్టి పరారైన కోహ్లి..
బాలీవుడ్ నటుడు, బిగ్‌ బాస్‌ మాజీ  కంటెస్టెంట్  అర్మాన్‌ కోహ్లి,  తన గర్ల్ ఫ్రెండ్  నీరూ రంధావా పై  తీవ్రంగా  దాడి చేసి  గాయపరిచాడు
  • News18
  • Last Updated: June 6, 2018, 2:37 PM IST
  • Share this:

 బాలీవుడ్ నటుడు, బిగ్‌ బాస్‌ మాజీ  కంటెస్టెంట్  అర్మాన్‌ కోహ్లి,  తన గర్ల్ ఫ్రెండ్  నీరూ రంధావా పై  తీవ్రంగా  దాడి చేసి  గాయపరిచాడు వివరాల్లోకి వెళితే...


ముంబాయిలోని శాంతా క్రజ్‌ పోలీసుల చెబుతున్నదాని  ప్రకారం... గత మూడేళ్లుగా నీరు, అర్మాన్ సహజీవనం చేస్తున్నారు. వీళ్లిద్దరు  ఆర్థిక విషయాలపై ఇప్పటికే పలు మార్లు గొడవపడ్డారు. గోవాలోని ఓ విల్లా అమ్మకం విషయంలో ఈ గొడవలు  తారస్థాయికి చేరాయి . ఆదివారం రాత్రి  తీవ్ర వాగ్వాదం అనంతరం   ఉన్మాదిలా మారిన కోహ్లీ, నీరూను జుత్తు  పట్టుకుని నేలకేసి కొట్టాడు. దీనితో  మెట్లపై నుంచి ఆమె జారి కిందపడింది.

తీవ్రంగా గాయపడిన నీరు, తనను హాస్పిటల్ కి  తీసుకెళ్లమని ఎంత బతిమాలాడిన  అర్మాన్ వినలేదు. అర్మాన్ వెళ్లిపోయిన తరువాత, చాలాసేపటికి తేరుకుని హాస్పిటల్  కి చేరుకున్న ఆమె, పోలీసులకు విషయాన్ని తెలిపింది. అర్మాన్ పై ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అర్మాన్ పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బాలీవుడ్‌లో 70 లలో  ‘నాగిన్‌’, ‘జానీ దుష్మన్‌’, ‘రాజ్‌ తిలక్‌’, లాంటి హిట్స్ ను అందించిన డైరెక్టర్  రాజ్‌కుమార్‌ కోహ్లి తనయుడే  అర్మాన్‌ కోహ్లి.  అర్మాన్ స్టార్టింగ్ లో  హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నాడు.ఆ తరువాత   బిగ్‌బాస్‌ షోతో ఒక్కసారే పాపులర్ అయ్యాడు . బిగ్‌బాస్‌-7 షో జరుగుతుండగానే కంటెస్టెంట్ తనీషా ముఖర్జీతో అర్మాన్‌ రొమాన్స్‌ చేయడం, మరో నటి సోఫియాతో గొడవపడటం, పోలీసులు ఏకంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిమరీ అర్మాన్‌ను అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం  రేపింది.
Published by: Sunil Kumar Jammula
First published: June 5, 2018, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading