వ్యవసాయ చట్టాలను (Agricultural laws) కేంద్రం వెనక్కి తీసుకోవడంపై దేశవ్యాప్తంగా రైతుల (farmers) నుంచి హర్షం వ్యక్తమవుతున్న తరుణంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలు (laws) రద్దు చేయనున్నామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నిర్ణయంపై కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందించింది. ఇది పూర్తిగా అన్యాయమంటూ పేర్కొంది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అటు ప్రతిపక్షాలు (Oppositions), ఇటు రైతు ఆందోళనకారులు (famer protestors) స్వాగతించారు. అయితే కంగనా రనౌత్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది.
నెటిజన్ పోస్ట్‌కి స్పందనగా..
పోరాటాల శక్తి నిరూపించిన ఫలితమిది అంటూ నెటిజన్ పోస్ట్ (netizen post)ను షేర్ చేసిన కంగనా ఇది చాలా విచారకరం, అవమానం.. పూర్తిగా అన్యాయం అని వ్యాఖ్యానించింది. అంతేకాదు పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధి పోరాటం చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే, ఇది కూడా జిహాదీ దేశమే (Jihadi country). ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ సెటైర్స్ వేసింది.
కాగా, బీజేపీ సర్కార్ (BJP government) తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘ పోరాటాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చట్టాలను రానున్న పార్లమెంటు సమావేశాల్లో (parliament sessions) రద్దు చేసేలా మోదీ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. అన్నదాతలు సాధించిన చారిత్రక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల ఉపసంహరణ ప్రకటనతో ఉత్తర భారత రైతులు ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర రైతులు పండుగ చేసుకుంటున్నారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..
కంగనా రనౌత్.. బాలీవుడ్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీ చిత్ర సీమలో కథనాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలంటే ఇపుడు కంగనా పేరునే చెబుతారు. బాలీవుడ్ రెబల్‌గా పేరు గాంచిన ఈ మణికర్ణిక కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అంతకు ముందు సహాయ నటిగా ఓ నేషనల్ అవార్డు అందుకుంది.ఇక 2020 యేడాదిగాను ఈమె కేంద్ర నుంచి పద్మశ్రీ అవార్డు అందుకుంది. కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం ఆలస్యంగా జరిగింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా కంగనా ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకుంది.
ఈ అవార్డు అందుకున్న సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ఈ అవార్డు తన వ్యతిరేకించే వాళ్లకు సమాధానం చెప్పింది. ఇక ఈ అవార్డు అందుకున్న సందర్భంగా కంగనా ఓ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదు.. అది బ్రిటిష్ వాళ్లు వేసిన భిక్ష అంది. దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పించారు. కంగనాపై కేసులు సైతం నమోదయయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers Protest, Instagram post, Kangana Ranaut, New Agriculture Acts