బాలీవుడ్ హీరోయిన్ బిపాసాబసు (Bipasabasu)ఆడబిడ్డను ప్రసవించింది. తమకు ఆడపిల్ల పుట్టిందనే వార్తను బిపాసాబసు ఆమె భర్త కరణ్‌సింగ్ గ్రోవర్(Karan Singh Grover)స్వయంగా సోషల్ మీడియా (Social media)ద్వారా వెల్లడించారు. అంతే కాదు పసిపాప పాదాలను చూపిస్తున్న ఫోటోను ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేస్తూ దేవి బసుసింగ్ గ్రోవర్ (Devi Basusingh Grover) అంటూ బేబీ పేరు, తన పేరు, భర్త పేరు వచ్చే విధంగా రాశారు. బిపాసాబసు దంపతులు తల్లిదండ్రులుగా మారిన విషయం తెలియడంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.
ఆడపిల్లకు జన్మనిచ్చిన బిపాసా..
2016లో కరణ్‌సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది బిపాసాబసు. అంతకు ముందు చాలా సినిమాల్లో నటించింది బిప్స్. తెలుగులో కూడా మహేష్‌బాబుతో టక్కరిదొంగ సినిమాలో యాక్ట్ చేసింది. అయితే ప్రెగ్నెన్సీ న్యూస్ దగ్గర నుంచి తన అప్డేట్స్ షేర్ చేసుకుంటూ వస్తోంది బిపాసాబసు. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సైతం ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే తాము బిడ్డ కోసం ఎదురుచూస్తున్నామంటూ ఆగస్ట్‌లోనే మెసేజ్ పెట్టిన బిపాసా చివరకు నవంబర్‌లో కోరిక తీరిందంటూ సంతోషం వ్యక్తం చేసింది.
View this post on Instagram
చాలా రోజులకు తల్లైంది..
బిపాసా, భర్త పెళ్లికి ముందే కలిసి నటించడంతో ఇద్దరూ కొద్ది రోజులు డేటింగ్లో ఉన్నారు. అటుపై వివాహం చేసుకున్నారు. బిపాసాతో పాటు ఆమె భర్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ డేంజరస్‌లో కూడా కలిసే నటిస్తున్నారు. బాలీవుడ్లో హీరోయిన్ ఆలియాభట్కి రీసెంట్గా అమ్మాయి పుట్టింది. మళ్లీ ఇప్పుడు మరో స్టార్ కపుల్‌గా ఉన్న బిపాసా దంపతులకు ఆడపిల్లే పుట్టడం విశేషం.
తిట్టిపోసిన నెటిజన్లు..
సరిగ్గా డెలివరీకి వారం వారం రోజుల ముందే అర్ధనగ్నంగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గోల్డ్ కలర్ లాంగ్ క్లాస్‌లో క్వీవేజ్తో పాటు బేబీ బంప్, థైస్ కనిపించేలా కూర్చొని దిగిన ఫోటోను తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేసింది బిపాసాబసు. ఇప్పుడు ఈఫోటోను చూసే నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోయే సమయంలో ఇలాంటి ఫోటోలు, ఇలాంటి కామెంట్స్ షేర్ చేయడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఇదేం మంచి పద్దతి కాదంటూ మరికొందరు సలహాలు ఇస్తున్నారు.
అప్పుడు ఆ వార్త వైరల్ ..
దేశ సంస్కృతిని దిగజార్చడం ఎంత వరకు కరెక్ట్ అని బిపాసాబసును సూటిగా ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. ఎంత హీరోయిన్ అయితే మాత్రం సిగ్గు, ఎగ్గు లేకుండా ఇలాంటి ఫోటోషూట్లు చేస్తారా అంటూ తిట్టిపోశారు.ఇది జరిగిన కొద్ది రోజులే తనకు ఆడపిల్ల జన్మించిందనే వార్తను షేర్ చేయడంతో అభిమానులు, నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood heroine, VIRAL NEWS