బోధ్‌గయా పేలుళ్ల దోషులకు యావజ్జీవ శిక్ష..!

జూన్ 7, 2013లో బోధ్ గయాలో బుద్ద ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన పేలుళ్లలో ఓ టిబెట్ సాధువుతో మరో యాత్రికుడికి గాయాలయ్యాయి.

Shiva Kumar Addula | news18india
Updated: June 6, 2018, 3:06 PM IST
బోధ్‌గయా పేలుళ్ల దోషులకు యావజ్జీవ శిక్ష..!
బోధ్ గయా పేలుళ్లు-ఫైల్ ఫొటో
  • Share this:
2013 నాటి బోధ్ గయ పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.

గత శుక్రవారం జడ్జి మనోజ్ కుమార్..  నిందితులు హైదర్ అలీ అలియాస్ బ్లాక్ బ్యూటీ, ఇంతియాజ్ అన్సారీ, ఉమర్ సిద్దిఖీ, అజారుద్దీన్ ఖరేషి, ముజీబుల్లా అన్సారీని దోషులుగా తేల్చారు.

జూన్ 7, 2013లో బీహార్‌లోని బోధ్ గయాలో బుద్ద ప్రార్థనా మందిరం దగ్గర పేలుళ్లు జరిగాయి.  బోధి చెట్టు దగ్గర భక్తులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబులు పేలాయి. అరగంట వ్యవధిలో తొమ్మిది పేలుళ్లు జరిగాయి. బీహార్‌ గడ్డపై జరిగిన తొలి ఉగ్రదాడి అదే. నాటి పేలుళ్లలో ఓ టిబెట్ సాధువుతో పాటు మరో యాత్రికుడికి గాయాలయ్యాయి.

బోధి చెట్టు కింద పాతిపెట్టిన సిలిండ్ బాంబు పేలలేదు. దాంతో ప్రాణనష్టం తప్పింది. సిమీ ఉగ్రవాద సంస్థ ఆ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన సిమి ఉగ్రవాది ఉమర్ సిద్దిఖీ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి. ఉమర్ సిద్దిఖీ, అజారుద్దీన్ ఖురేషీ చత్తీస్ గఢ్ వాసులు కాగా, మిగిలిన దోషులంతా వారంతా జార్ఖండ్‌కు చెందిన వారు.

ఈ  ఐదుగురు దోషులు 2013 నాటి పాట్నాపేలుళ్ల కేసులోనూ అనుమానితులుగా ఉన్నారు. అక్టోబరు 23న గాంధీ మైదాన్‌లో నిర్వహించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ర్యాలీలో 23 పేలుళ్లు జరిగాయి. నాటి ఘటనలో  ఏడుగురు చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు.
Published by: Shiva Kumar Addula
First published: June 1, 2018, 8:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading