రాజస్థాన్‌లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి.. 20 మందికి పైగా గల్లంతు

కొంత మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా.. మరికొందరిని స్థానికులు కాపాడారు. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

news18-telugu
Updated: September 16, 2020, 1:23 PM IST
రాజస్థాన్‌లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి.. 20 మందికి పైగా గల్లంతు
ఘటనా స్థలంలో సహాయక చర్యలు
  • Share this:
రాజస్థాన్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలో చంబల్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 20 మందిని స్థానికులు, రెస్క్యూ బృందాలు క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు. వారి కోసం నదిలో గాలిస్తున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గోత్డా కాలా గ్రామానికి చెందిన 50 మంది కమలేశ్వర్ ధామ్ ఆలయానికి వెళ్లేందుకు పడవ ఎక్కారు. అక్కడకు వెళ్లాలంటే చంబల్ నది దాటాలి. ఐతే నదిలో కొంత దూరం ముందుకు వెళ్లాక ఒక్కసారిగా పడవ బోల్తాపడింది. ప్రయాణికులు నీటిలో పడిపోయారు. కొంత మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా.. మరికొందరిని స్థానికులు కాపాడారు. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని కోటా జిల్లా కలెక్టర్ ఉజ్వల్ సింగ్ రాథోడ్ తెలిపారు. సహాయక చర్యలను దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనతో కోటాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 16, 2020, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading