బస్టాండ్‌లో బ్లూఫిలిం కలకలం.. షాక్ తిన్న ప్రయాణికులు..

బస్టాండ్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని భోపాల్ మేయర్ అలోక్ శర్మ అన్నారు. దీనిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరినట్టు తెలిపారు.

news18-telugu
Updated: November 23, 2019, 4:05 PM IST
బస్టాండ్‌లో బ్లూఫిలిం కలకలం.. షాక్ తిన్న ప్రయాణికులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మధ్యప్రదేశ్‌లోని ఓ బస్టాండ్‌లో ఛార్జీలు వసూలు చేసే మెషీన్‌ డిస్‌ప్లేపై బ్లూఫిలిం ప్రసారమైంది. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు షాక్ తిన్నారు. బస్సు కోసం వేచి చూస్తున్న ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా మధ్యప్రదేశ్
పోలీసులు విచారణ జరపగా.. భోపాల్‌లోని హోషంగాబాద్‌లో ఈ ఘటన జరిగినట్టు వెల్లడైంది. ఈ ఘటన భోపాల్ మున్సిపల్ కార్పోరేషన్&భోపాల్ సిటీ లింక్ లిమిటెడ్(BCCL)ను ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. పర్యవేక్షణ లోపం వల్లే ఛార్జీలు వసూలు చేసే మెషీన్‌లో ఎవరో బ్లూఫిలిం అప్‌లోడ్ చేశారని అంటున్నారు.

ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం.. ఫేర్ కలెక్షన్ మెషీన్(చార్జీలు వసూలు చేసే మెషీన్)లో అక్టోబర్ 28న ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అందులో బ్లూఫిలిం అప్‌లోడ్ చేశాడు. దీనిపై సైబర్ సెల్‌ అధికారులకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
భోపాల్ మున్సిపల్ కార్పోరేషన్ & భోపాల్ సిటీ లింక్ లిమిటెడ్(BCCL)


బస్టాండ్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని భోపాల్ మేయర్ అలోక్ శర్మ అన్నారు. దీనిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరినట్టు తెలిపారు. ఆ ఘటనకు బాధ్యులైనవారిని పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
First published: November 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>