• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BLOWING KISSES ARE SEXUAL GESTURES THAT AMOUNT TO SEXUAL HARASSMENT VS

పోక్సో యాక్ట్ : ఫ్లయింగ్ కిస్ పెట్టినందుకు యువకుడికి ఏడాది జైలు శిక్ష

పోక్సో యాక్ట్ :  ఫ్లయింగ్ కిస్ పెట్టినందుకు యువకుడికి ఏడాది జైలు శిక్ష

pocso act

పోక్సో యాక్ట్ : ఇరవై సంవత్సరాల యువకునికి ఏడాది జైలు శిక్ష విధించిన ముంబయి పోక్సో కోర్టు తీర్పు..పిల్లలకు సైగలు చేయడం , చూసి నవ్వడం కూడ లైంగిక వేధింపుల క్రిందకే వస్తాయని కోర్టు వ్యాఖ్యానించిన కోర్టు .

  • Share this:
పద్నాలుగు సంవత్సరాల [మైనారీటి తీరని} అమ్మాయికి ఫ్లైయింగ్ కిస్‌లు ఇవ్వడం, కళ్లు మూసుకుని వెకిలిగా చూడడంతో ఓ 20 ఏళ్ల యువకుడికి పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. శిక్షతో పాటు 15000 రూపాయల జరిమాన కూడ విధించింది.

వివరాల్లోకి వెళితే గత ఏడాది ఫిబ్రవరి 29న యువతి తన సోదరితో కలిసి ఉన్నప్పుడు తన ఇంటిపక్కనే ఉండే 20 సంవత్సరాల యువకుడు ఆ చిన్నారిపై కళ్లు మూసుకుని ప్లయింగ్ కిస్ ఇచ్చాడని తెలిపింది. కాగా అంతకు ముందు కూడ ఇలాంటీ చర్యలకు పాల్పడ్డాడని చిన్నారి వివరించింది.అయితే దీనిపై చిన్నారీ తల్లి ముద్దులు పెట్టిన వారి తల్లిదండ్రులకు కూడ చెప్పింది. అయినా ఇలాగే కొనసాగడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు యువకున్ని అరెస్ట్ చేసి పోక్స్ చట్టం ద్వార కేసు నమోదు చేశారు.

అయితే కోర్టులో నిందితుని కావాలని ఇరికించేందుకు ప్లాన్ వేశారని వాదనలు జరిగాయి. యువకునికి మరియు ఫిర్యాదు చేసిన వారికి మధ్య బెట్టింగ్ ఉందని అందుకే అలా చేశాడని వాదించారు. కాని కోర్టు మాత్రం ఇలాంటీ ఆధారాలు ఏవి లేవని స్పష్టం చెసింది. ఇలా పిల్లలకు సైగలు చేసినా...వెకిలి చూపులు చూసినా లైంగిక వేధింపుల క్రిందకే వస్తాయని కోర్టు పేర్కోంది. కాగా దేశంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోక్స్ చట్టం ద్వార కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే...కాగ ఇందుకోసం ప్రత్యేక కోర్టులు కూడ ఉన్నాయి.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు