హోమ్ /వార్తలు /జాతీయం /

పుల్వామా బాధితులకు రూ.110 కోట్ల విరాళం...అంధ శాస్త్రవేత్త దాతృత్వం

పుల్వామా బాధితులకు రూ.110 కోట్ల విరాళం...అంధ శాస్త్రవేత్త దాతృత్వం

అమర జవాన్ల ఫొటోలు

అమర జవాన్ల ఫొటోలు

జవాన్లపై పుల్వామా తరహాలో దాడులు జరగకుండా కొత్త ఆవిష్కరణను కనిపిపెట్టినట్లు ఆయన తెలిపారు. ఫ్యూయెల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా జీపీఎస్, ఇతర సాంకేతిక పరిజ్ఞాన అవసరం లేకుండానే వాహనాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టవచ్చని తెలిపారు. తద్వారా సైన్యం వాహనాలపై దాడులు జరగకుండా నిరోధించవచ్చని పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

  పుల్వామా ఉగ్రదాడిని భారత జాతి ఇంకా మరువలేదు. 40 మంది జవాన్లను కోల్పోయిన ఆ మారణకాండను ఇప్పటికీ కంటతడి పెట్టిస్తోంది. పుల్వామా అమరవీరులకు వ్యాపారవేత్తలు, సినీ, క్రీడాప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు పంపించారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో సాయం చేశాయి. అమర వీరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. తాజాగా ఓ అంధ సైంటిస్ట్ పుల్వామా అమరజవాన్ల కుటుంబాలకు ఏకంగా రూ.110 కోట్లు విరాళం ప్రకటించారు. కళ్లతో ఈ లోకాన్ని చూడకున్నా తన దాతృత్వ హృదయంతో అందరి కళ్లనూ తెరిపించారు.


  రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన ముర్తాజా హమీద్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ముంబైలో స్థిరపడ్డారు. పుల్వామా ఉగ్రదాడిపై అందరిలాగే తానూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమరవీరులకు తన కళ్లతో చూడలేకపోయినా దేశ కోసం వాళ్లు చేసిన ప్రాణత్యాగాన్ని చూశారు. జవాన్ల కుటుంబాల కన్నీళ్లను అర్థం చేసుకున్నారు. అందుకే పెద్ద మనసుతో రూ. 110 కోట్లను విరాళం ప్రకటించారు. ఆ మొత్తాన్ని ప్రధాని మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు పంపుతున్నట్లు ప్రకటించారు. తనను కలవాల్సిందిగా ప్రధాని కార్యాలయానికి లేఖరాశారు హమీద్.


  అంతేకాదు జవాన్లపై పుల్వామా తరహాలో దాడులు జరగకుండా కొత్త ఆవిష్కరణను కనిపిపెట్టినట్లు హమీద్ తెలిపారు. 'ఫ్యూయెల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీ' ద్వారా జీపీఎస్, ఇతర సాంకేతిక పరిజ్ఞాన అవసరం లేకుండానే వాహనాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టవచ్చని తెలిపారు. తద్వారా సైన్యం వాహనాలపై దాడులు జరగకుండా నిరోధించవచ్చని పేర్కొన్నారు. 2016 అక్టోబరులో ఈ టెక్నాలజీ ఆమోదం కోసం NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా)కు దరఖాస్తు చేశానని..2018 అక్టోబరులో దాన్ని ఆమోదించారని చెప్పారు. ఆ పరికరాన్ని ఇండియన్ ఆర్మీతో పాటు సాయుధ బలగాలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమీద్ స్పష్టంచేశారు.

  First published:

  Tags: CRPF, Jammu and Kashmir, Pulwama Terror Attack

  ఉత్తమ కథలు