హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు.. మూడు కార్లు ధ్వంసం

Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు.. మూడు కార్లు ధ్వంసం

ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద భారీగా భద్రతా సిబ్బంది (Image; ANI)

ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద భారీగా భద్రతా సిబ్బంది (Image; ANI)

దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు సంభవించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి అక్కడున్న మూడుకార్లు ధ్వంసం అయ్యాయి. కార్లు అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్టు తెలిసింది.

    దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు సంభవించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి అక్కడున్న మూడుకార్లు ధ్వంసం అయ్యాయి. కార్లు అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్టు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం నుంచి సుమారు 40 నుంచి 50 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఘటన విషయం తెలిసిన వెంటనే అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు జరిగిన సమయంలోనే అక్కడకు ఒక కిలోమీటర్ దూరంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు జరిగినట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ధ్రువీకరించారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ పేవ్‌మెంట్ కింద IED అమర్చినట్టు గుర్తించారు. బీటింగ్ రీ ట్రీట్ జరుగుతున్న సమయంలో విజయ్ చౌక్‌కి 1.7 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది..

    ఈ ఘటనలో ఎవరికైనా గాయాలు అయ్యాయా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. బాంబ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు. ఇతర దేశాల రాయబార కార్యాలయాలు ఉండే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాలను అప్పమత్తం చేశారు. ఇక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో ఎవరైనా తిరిగారా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

    ఓ వైపు ఢిల్లీలో రైతుల ఆందోళన, పలు హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలోనే ఈ పేలుడు కూడా జరగడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకోవడానికి అంతర్గతంగా ఆదేశాలు వెళ్లాయి.

    ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో ఎయిర్ పోర్టులకు హై అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ భవనాల వద్ద కూడా అలర్ట్‌గా ఉండాలని పోలీసులు ఆదేశించారు. భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. అలాగే, ముంబైలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయంతో పాటు పలు చోట్ల గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. దేశంలోని పలు విమానాశ్రయాల్లో కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పటిష్ట భద్రత కోసం అదనపు భద్రతా సిబ్బందిని నియమిస్తున్నారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: BLAST, New Delhi

    ఉత్తమ కథలు