హోమ్ /వార్తలు /జాతీయం /

పుల్వామాలో మరో పేలుడు..

పుల్వామాలో మరో పేలుడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పుల్వామా జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలో పేలుడు జరిగినట్టు అధికారులు ధ్రువీకరించారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

    జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో పేలుడు జరిగింది. పుల్వామా జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలో పేలుడు జరిగినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ రోజు సాయంత్రం పేలుడు జరిగినట్టు చెప్పారు. అయితే, ఈ పేలుడు ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఇందులో ఏమైనా ఉగ్రవాదుల పాత్ర ఉందా? అనే కోణంలో స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. పేలుడులో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు స్పష్టం చేశారు. ఎవరూ గాయపడలేదని కూడా అధికారులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇటీవల పుల్వామాలోనే ఉగ్రదాడి జరిగింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేయడంతో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ .. పాకిస్తాన్ ఆక్రమతి కాశ్మీర్‌లోని బాలాకోట్, మరో రెండు ప్రాంతాల్లో ఎయిర్‌స్ట్రైక్ చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

    First published:

    Tags: Jammu and Kashmir, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు