హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Maharashtra: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన 40 మంది..!

Maharashtra: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన 40 మంది..!

ప్రతీకాత్మక చిత్రం(Image-Reuters)

ప్రతీకాత్మక చిత్రం(Image-Reuters)

మహారాష్ట్ర రత్నాగిరి జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో పేలుడు జరగడంతో నలుగురు మృతిచెందారు.

  మహారాష్ట్ర రత్నాగిరి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. రత్నాగిరి జిల్లాలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సంభవించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో 40 నుంచి 50 మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఫ్యాక్టరీలో చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

  అయితే పేలుడులో గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక, రసాయన పరిశ్రమలో పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

  కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: BLAST, Maharashtra

  ఉత్తమ కథలు